కొట్టొద్దంటూ వేడుకుంటున్న అభిమాని రేణుకాస్వామి
రేణుకాస్వామి హత్య కేసు విచారణలో పోలీసులు చార్జిషీట్ ఫైల్ చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 Sep 2024 11:35 AM GMTరేణుకాస్వామి హత్య కేసు విచారణలో పోలీసులు చార్జిషీట్ ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. పవిత్ర గౌడ, కన్నడ నటుడు దర్శన్‌తో పాటు ఇతర నిందితులపై వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు దొరికాయని వారు వెల్లడించారు దోషులపై ఆరోపణలతో వివరణ ఇచ్చారు.. ఇటీవల రేణుకా స్వామి చేతులకు గాయాలు కాగా, చేతులను అడ్డు పెట్టుకుని తనను వేధించవద్దని అభ్యర్థిస్తున్న ఫోటో ఒకటి అంతర్జాలంలో వైరల్ అవుతోంది. అతడు దెబ్బలు తాళలేక ఏడుస్తున్న వైనం ఈ ఫోటోలో కనిపిస్తోంది. ఫోటో చూసినవారికి రేణుక స్వామి పరిస్థితి ఎలా ఉందో అర్థమైంది. ఆర్.నగర్ పట్నంగెరె షెడ్లో హత్య చేసిన సందర్భంలో ఆ సమయంలో తీసిన ఒకానొక ఫోటో ఇది అని మీడియా పేర్కొంది.
చిత్రదుర్గదకు చెందిన రేణుక స్వామిని పట్నంగెరలోని షెడ్‌కి తరలించారు. ఇదంతా ప్లాన్ ప్రకారం సాగిన అఘాయిత్యం అనే ఆరోపణలున్నాయి. ఈ ఉదంతంలో పవిత్ర-దర్శన్ గ్యాంగ్ మీద హత్యాఆరోపణలు వచ్చాయి. వీరు కొందరు గ్యాంగ్ తో కలిసి రేణుకా స్వామిని తట్టుకోలేనంతగా టార్చర్ చేసారు. టార్చర్ కి సంబంధించిన ఆధారాలన్నీ పోలీసులకు లభ్యమయ్యాయి. రేణుక స్వామి చేయి తెగిపడినట్టు ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. నిందితుల మొబైల్ నుంచి దీనిని పోలీసులు సేకరించారు.
రక్తపు మరకలతో ఉన్న పవిత్ర చెప్పులను కూడా సీజ్ చేసిన సంగతి తెలిసిందే. పబ్ లో ఎంజాయ్ చేస్తున్న దర్శన్ కి వచ్చిన మెసేజ్ లను కూడా పోలీసులు ట్రేస్ చేసారు. నిజానికి రేణుక చివరి క్షణాల ఫోటోలను ఫోన్ లో సహచరులకు షేర్ చేసిన తర్వాత దీనిని డిలీట్ చేసారు. ఇప్పుడు ఈ ఫోటోలు రిట్రీవ్ చేసి విచారణాధికారులు అసలు రహస్యాన్ని ఛేధించారు. ఛార్జ్‌షీట్‌లో ఈ ఫోటోలు ఆధారాలుగా ఉన్నాయి. ఈ కేసులో ప్రముఖ సాక్షి విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. అయితే రేణుకా స్వామి హత్య కేసు విచారణను ప్రత్యేక కోర్టుకు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి దీనిపై విన్నపం అందింది.