దాన్నే నమ్ముకున్న రేణూ దేశాయ్!
పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకుని తర్వాత విడాకులు తీసుకున్న రేణూ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ లైఫ్ ను కొనసాగిస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 23 Oct 2025 3:00 AM ISTరేణూ దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బద్రి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన రేణూ ఆ తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్ గా, రైటర్ గా, డైరెక్టర్ గా మారి తన లక్ ను టెస్ట్ చేసుకున్నారు. నటిగానే కాకుండా మల్టీ టాలెంటెడ్ అని పేరు తెచ్చుకున్న రేణూ పెళ్లి తర్వాత యాక్టింగ్ కు దూరమయ్యారు. పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకుని తర్వాత విడాకులు తీసుకున్న రేణూ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ లైఫ్ ను కొనసాగిస్తున్నారు.
20 ఏళ్ల తర్వాత సీరియస్ పాత్రతో కంబ్యాక్
సుమారు 20 ఏళ్ల తర్వాత రేణూ, టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో తిరిగి యాక్టింగ్ లోకి అడుగుపెట్టారు. రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమాలో రేణూ హేమలతా లవణం అనే సోషల్ యాక్టివిస్ట్ పాత్రలో కనిపించారు. ఆ సినిమా ఫ్లాపవడంతో పాటూ మూవీలో రేణూ పాత్ర చాలా సీరియస్ గా ఉండటం, ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆ మూవీ రేణూకి ఎగ్జైటింగ్ అవకాశాలను తెచ్చిపెట్టలేదు.
అత్తా కోడళ్ల మూవీలో రేణూ
టైగర్ నాగేశ్వరరావు ఫ్లాప్ అయినప్పటికీ రేణూకి కొన్ని అవకాశలైతే వచ్చాయి. కానీ తనకు వచ్చిన అవకాశాలేవీ ఆమె అనుకున్న రీతిలో లేకపోవడంతో రేణూ వేటినీ ఒప్పుకోలేదు. ప్రస్తుతం కొత్త ఆఫర్ల కోసం చూస్తున్న రేణూ రీసెంట్ గా ఓ సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. అత్తా కోడళ్ల నేపథ్యంలో సాగే ఓ కామెడీ మూవీలో రేణూ అత్త పాత్రలో కనిపించనున్నారట.
ఈ ప్రాజెక్టులో రేణూ ఓ హీరోయిన్ కు అత్త పాత్రలో కనిపించనున్నారని కూడా చెప్పారు. అయితే ఆ ప్రాజెక్టు గురించి మిగిలిన వివరాలను మాత్రం రేణూ వెల్లడించలేదు. హేమలత పాత్రలో రేణూ సోషల్ యాక్టివిస్ట్ గా సీరియస్ క్యారెక్టర్ ను చేయడంతో తన కంబ్యాక్ పెద్దగా ఎఫెక్టివ్ గా లేదు. కానీ ఇప్పుడు ఈ సినిమా కామెడీ బ్యాక్ డ్రాప్ లో రానుండటంతో ఇది వర్కవుట్ అయితే రేణూకి ఇలాంటి మరిన్ని అవకాశాలు రావడంతో పాటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రేణూ బిజీ అయ్యే ఛాన్సుంది. ఈ కామెడీ డ్రామా కచ్ఛితంగా తన కెరీర్ కు ఉపయోగపడుతుందని రేణు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
