కల్కి మూవీ చూశాం కదా.. అంతా చివరకు పోవాల్సిందే: రేణు దేశాయ్
ప్రముఖ నటి రేణు దేశాయ్ తాజాగా పెట్టిన ప్రెస్ మీట్లో కుక్కల విషయంపై చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 23 Jan 2026 9:08 AM ISTప్రముఖ నటి రేణు దేశాయ్ తాజాగా పెట్టిన ప్రెస్ మీట్లో కుక్కల విషయంపై చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అనేక మంది ఆమెను సమర్థించగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. నెట్టింట ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ విషయంపై మరోసారి స్పందించిన రేణు.. లాంగ్ వీడియో పోస్ట్ చేశారు.
"నేను ప్రెస్ మీట్ లో 30 నిమిషాలు మాట్లాడగా.. మొత్తం వినకుండా ఎవరికి నచ్చినట్లు వాళ్లు కామెంట్ చేస్తున్నారు.. ఆరోజు నేను కుక్కలు ఇష్టపడేవారి కోసం రాలేదు.. ద్వేషించే వారి కోసం రాలేదు. మనందరికీ ఒకటే సమస్య.. ఏ ప్రాణమైనా విలువైనదే. ఎవరి ప్రాణం పోకూడదు. కానీ కొన్ని కుక్కలు తప్పు చేస్తున్నాయ్. అందుకే అన్ని కుక్కలు చంపకూడదు" అని అన్నారు.
"వందల్లో కుక్కలను దారుణంగా చంపేస్తున్నారంటే అప్పుడు బయటకు వచ్చి మాట్లాడాను. నేను ఒక సొల్యూషన్ చెప్పాను. కానీ నాకు చాలా మంది ఏసీలో తిరుగుతారు.. నాకెలా బాధ తెలుస్తుందని అన్నారు. అవును నాకు బాధ తెలియదు.. నా వీధిలో ఫ్రెండ్లీ కుక్కలు ఉన్నాయి. నాకేం అనవు. కానీ మీ ఏరియాలో దాడి చేస్తున్నాయ్. అయితే నాకు ఒకరు కాల్ చేసి జైలులో నన్ను పెట్టేస్తా అన్నారు. చాలా తిట్లు తిట్టారు" అని చెప్పారు.
"కుక్కలను ప్రేమించేవారు, ద్వేషించేవారు అంతా నన్ను తిడుతున్నారు. నేనేం చేయాలి ఇప్పుడు.. కొంచెం సెన్స్ ఉంటే మీ చుట్టూ ఉన్న కుక్కల్లో మేల్ వి గుర్తించండి.. మేం హెల్ప్ చేస్తాం.. అప్పుడు వాటికి స్టెరిలైజ్ చేయండి.. అలా చేస్తే అవి ప్రెగ్నెంట్స్ చేయవు. అప్పుడు చాలా వరకు కౌంట్ తగ్గుతుంది. అందుకే మీ చుట్టూ ఉన్న ఏరియాల్లో మగ కుక్కలు ఉంటే జీహెచ్ఎంసీ వాళ్లకు చెప్పండి" అని కోరారు.
"వ్యాక్సినేషన్ పై కచ్చితంగా అంతా వర్క్ చేయాలి. నేను ఎవరి ప్రాణం కూడా పోకూడదని ఆలోచిస్తున్నా. నాకు తిట్టే ముందు ఆలోచించండి.. ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పా.. కొన్ని మాత్రమే కుక్కలు పిచ్చిగా ఉంటాయని. అన్నింటికి శిక్ష వేయొద్దని చెప్పా. ప్రాణంపై భీతి ఉంటే ఆహారం లేక మందులు లేక ఇబ్బంది పడుతున్న చిన్నారులను కాపాడండి. ఎందుకంటే ఎవరి ప్రాణమైనా ప్రాణమే" అని చెప్పారు.
"నాకు తిట్టే బదులు.. ఎమ్మెల్యే, కార్పొరేటర్ ను సంప్రదించండి.. ఏమైనా యూజ్ అవుతుంది.. నన్ను తిట్టి ఏం సాధించారు.. కేవలం డబ్బులు సంపాదిస్తున్నారు.. ప్రభుత్వం నుంచి కోట్లలో డబ్బులు వస్తుండడంతో ఓటు వేసిన వారికి వెళ్లి అడగండి.. అప్పుడే సొల్యూషన్ దొరుకుతుంది.. ఏదేమైనా కుక్కలు పోతాయ్, పిల్లులు పోతాయ్, కోతులు పోతాయ్, చివరికి మనమూ పోతాం. అంతా ప్రభాస్ చిత్రం కల్కి చూశారు కాదా. అందులో ఎలా ఉందో అదే మిగులుతుంది. అందుకే ద్వేషం లేకుండా ప్రశాంతంగా జీవిస్తే చాలు" అంటూ చెప్పుకొచ్చారు.
