రాజసం ఉట్టిపడేలా ఆకట్టుకుంటున్న రేణూ దేశాయ్.. ఎప్పుడూ ఇలా చూడలేదు భయ్యా!
రేణూ దేశాయ్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్యగా అవతరించక ముందు హీరోయిన్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా మంచి పేరు సొంతం చేసుకుంది.
By: Madhu Reddy | 1 Dec 2025 11:00 PM ISTరేణూ దేశాయ్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్యగా అవతరించక ముందు హీరోయిన్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా మంచి పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా బద్రి, జానీ వంటి చిత్రాలలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ఈమె పెళ్ళికి ముందే పవన్ కళ్యాణ్ తో సహజీవనం చేసి అఖీరా నందన్ కు జన్మనిచ్చింది. కొడుకు సమక్షంలో వివాహం చేసుకున్న వీరు ఆద్య అనే అమ్మాయికి జన్మనిచ్చారు. కానీ కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
ఇక అప్పటినుంచి పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ పూణే లోనే సెటిలైపోయిన రేణూ దేశాయ్ అటు పేద పిల్లలకు, పేదవారికి, జంతువులకు తోచినంత సహాయం చేస్తూ.. మంచి మనసు చాటుకుంటుంది. అంతేకాదు ఎన్జీవో కూడా నడుపుతున్న ఈమె అవసరమైన డబ్బులను అభిమానుల ద్వారా అడుగుతూ వాటి అవసరాలను తీరుస్తూ ఉంటుంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయంపై స్పందించే రేణు దేశాయ్ తొలిసారి ర్యాంప్ వాక్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. రాజసం ఉట్టిపడేలా తన అందంతో ఆకట్టుకుంది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయడంతో ఈ గెటప్లో రేణుదేశాయ్ ను ఎప్పుడు ఇలా చూడలేదు అంటూ అభిమానులు సైతం తెగ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఫోటోల విషయానికి వస్తే.. మల్టీకలర్ సిల్క్ సారీ ధరించిన ఈమె దీనికి గోల్డెన్ కలర్ పైతాన్ వర్క్ తో డిజైన్ చేశారు. ఈ చీరకు కాంబినేషన్ లో క్రీం కలర్ బ్లౌజు ధరించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సిల్క్ చీరను హైలైట్ చేస్తూ తన అందాన్ని రెట్టింపు చేసుకునేలా సింపుల్ జువెలరీతో తన మేకోవర్ ను ఫినిష్ చేసింది. రాజసం ఉట్టిపడేలా ఆమె ర్యాంప్ వాక్ చేస్తూ నడిచిన తీరుకి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. తొలిసారి మహారాణి గెటప్ లో కనిపించింది అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే రేణూ దేశాయ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
రేణు దేశాయ్ కెరియర్ విషయానికొస్తే.. రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంటుంది అనుకున్నారు. కానీ మరి అవకాశాలు రాలేదో లేక ఈమె ఇంకో సినిమాకు అవకాశం ఇవ్వలేదో తెలియదు కానీ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది రేణు దేశాయ్. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్గా ఉంటూ అభిమానులకు చేరువలో ఉంటుంది. ఏది ఏమైనా రేణు దేశాయ్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
