టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?
చాలా కాలం తర్వాత ధనుష్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘ఓం’లో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మమ్ముట్టి పోషిస్తున్న బర్మా కార్తికేయన్ పాత్రకు భార్యగా, సెకండాఫ్‌లో కథను మలుపు తిప్పే సమయంలో ఆమె ఎంట్రీ ఉంటుందని సమాచారం. ఈ సినిమా తర్వాత రేణు దేశాయ్ టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస అవకాశాలు అందుకుంటారా అన్న ఆసక్తి నెలకొంది.
By: Ramesh Palla | 18 Nov 2026 10:00 PM ISTహీరోయిన్‌గా కేవలం మూడు సినిమాలే చేసినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునే పేరు రేణు దేశాయ్. ఈమె హీరోయిన్‌గా నటించిన మూడు సినిమాల్లో ఒకటి తమిళ్ మూవీ కాగా, రెండు తెలుగు సినిమాలు. ఆ రెండు సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ కు జోడీగా నటించినవే కావడం విశేషం. పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమాలో నటిస్తున్న సమయంలో ఆయనతోనే ప్రేమలో పడ్డ రేణు దేశాయ్, అప్పటి నుంచి ఆయన తో సహజీవనం చేస్తూ వచ్చింది. సహజీవనం సమయంలోనే జానీ సినిమాను సైతం పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ చేసింది. ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరం అయింది. పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకోవడం, విడిపోవడం జరిగింది. విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ సినిమాలతో బిజీ కావాలని ఆశ పడింది. కానీ అది కుదరలేదు అనేది టాక్. దర్శకురాలిగా, నిర్మాతగా సినిమా ప్రయత్నాలు చేసిన విషయం తెల్సిందే.
రవితేజ సినిమాలో రేణు దేశాయ్..
నటిగా రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు లో కనిపించింది. ఆ సినిమాలో ప్రముఖ సంఘ సంస్కర్త హేమలతా లవణం పాత్రలో నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. అయినా కూడా కొన్ని పాత్రలతో దర్శక నిర్మాతలు రేణు దేశాయ్ ను సంప్రదించడం జరిగింది. కానీ ఆమె మాత్రం సున్నితంగా తిరస్కరించింది. ఆ మధ్య ఒక స్టార్ హీరో సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించబోతుందనే వార్తలు వచ్చాయి, ఆ వార్తలు నిజం కాదని తేలిపోయింది. ఇప్పుడు తమిళ మూవీ ఓం తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. 2000 సంవత్సరంలో తమిళ్ లో హీరోయిన్‌గా చేసిన రేణు దేశాయ్ దాదాపు 26 ఏళ్ల తర్వాత మళ్లీ తమిళ మూవీ చేయడం ద్వారా అందరి దృష్టి ఆమె పాత్రపై ఉంది.
ధనుష్ ఓం సినిమాలో నటించిన...
ధనుష్ హీరోగా సాయి పల్లవి, మమ్ముట్టీ, శ్రీలీల ముఖ్య పాత్రల్లో నటించిన 'ఓం' సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించబోతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మమ్ముట్టీ పోషించిన బర్మా కార్తికేయన్ పాత్రకు రేణు దేశాయ్ భార్య పాత్రలో కనిపించబోతుంది. సినిమాలో రేణు దేశాయ్ పాత్ర సెకండ్ హాఫ్ లో పరిచయం అవుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కథలో కీలక మలుపు సమయంలో రేణు దేశాయ్ ఎంట్రీ ఇస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని, రేణు దేశాయ్ పాత్రకు మంచి పేరు వస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. తెలుగులో రేణు దేశాయ్ నటించిన కారణంగా బజ్ మరింతగా పెరిగింది అనడంలో సందేహం లేదు. రేణు దేశాయ్ ఓం సినిమాలో నటించిన కారణంగా ఇక మీదట తెలుగు నిర్మాతలు ఆమె చుట్టూ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టాలీవుడ్‌లో రేణు దేశాయ్ మూవీస్...
గతంతో పోల్చితే రేణు దేశాయ్ ఇప్పుడు సినిమాల ఎంపిక విషయంలో కాస్త ఫ్రీ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు సినిమాల పాత్రలను ఎంపిక చేసుకునేందుకు అనేక విషయాలు అడ్డుగా ఉండేవి. కానీ ఇప్పుడు రేణు దేశాయ్ తన పిల్లలు పెద్ద వారు కావడంతో పాటు, వారి కెరీర్ ప్లాన్‌లో వారు ఉన్నారు. కనుక రేణు దేశాయ్ కి కావాల్సినంత సమయం లభిస్తుంది. అందుకే టాలీవుడ్‌లో ఇక మీదట వరుసగా సినిమాలు చేసేందుకు ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రేణు దేశాయ్ ఓం సినిమాలో చేసిన తరహా పాత్రలు టాలీవుడ్‌లో ఓకే చెప్తే కచ్చితంగా ఏడాదిలో మూడు నాలుగు సినిమాలు అయినా నటించే అవకాశం ఉంటుంది. మరి రేణు దేశాయ్ టాలీవుడ్‌లో ఇక మీదట వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేసేందుకు రెడీగా ఉందా అనేది చూడాలి. రేణు దేశాయ్ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో భారీ పారితోషికాలు ఆఫర్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి రేణు దేశాయ్ నిర్ణయం ఏంటీ అనేది చూడాలి.
