Begin typing your search above and press return to search.

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

అయితే కరణ్ జోహార్ గురించి రేణు చెప్పిన మరో మాట ఇక్కడ హైలెట్ అయ్యింది.

By:  M Prashanth   |   4 Nov 2026 9:32 AM IST
షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..
X

షారూక్ ఖాన్, కరణ్ జోహార్ మధ్య ఉన్న స్నేహం గురించి బాలీవుడ్‌లో చాలామందికి తెలుసు. ఇద్దరూ కలిసి పలు సినిమాలు చేశారు. అయితే షారూక్ అంటే కరణ్‌కు ఎంత అభిమానమో చెప్పడానికి రేణు దేశాయ్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో షారూక్ కోసం కరణ్ స్వయంగా విదేశాల్లో బట్టలు కొనేవారట. అదేదో కాస్ట్యూమ్ డిజైనర్‌గా తనకు అప్పగించిన పని కాదని, షారూక్‌పై ఉన్న ప్రేమతోనే చేసేవారని రేణు చెప్పారు.

ఇటీవల రేణు దేశాయ్ తన స్టైలింగ్ అనుభవాల గురించి మాట్లాడారు. దాదాపు 25 ఏళ్ల క్రితం లండన్‌లోని సెల్ఫ్రిడ్జెస్ షాపింగ్ మాల్‌కు వెళ్లినప్పుడు తరచూ కరణ్ జోహార్ కనిపించేవారని చెప్పారు. తాను పవన్ కల్యాణ్ కోసం దుస్తులు కొనుగోలు చేస్తుంటే కరణ్ మాత్రం షారూక్ కోసం బట్టలు ఎంచుకునేవారట. అలా ఇద్దరూ చాలాసార్లు ఒకే మాల్‌లో ఎదురుపడ్డట్లు గుర్తుచేసుకున్నారు.

అయితే కరణ్ జోహార్ గురించి రేణు చెప్పిన మరో మాట ఇక్కడ హైలెట్ అయ్యింది. ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ కాదని, షారూక్‌పై ఉన్న ప్రేమతోనే ఆ పని చేసేవారని అన్నారు. అప్పటికే కరణ్ పెద్ద స్థాయిలో ఉన్నారని, స్వయంగా షాపింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. అయినప్పటికీ తనకు ఇష్టమైన వ్యక్తి కోసం అంత సమయం కేటాయించేవారన్నమాట.

నిజానికి షారూక్, కరణ్ మధ్య అనుబంధం కేవలం సినిమాల వరకే పరిమితం కాలేదు. 'కుచ్ కుచ్ హోతా హై', 'కభీ ఖుషీ కభీ ఘమ్', 'కభీ అల్విదా నా కెహనా', 'మై నేమ్ ఈజ్ ఖాన్' లాంటి సినిమాలతో వీరిద్దరూ కలిసి వర్క్ చేశారు. కెరీర్ ప్రారంభం నుంచి షారూక్ తనకు ఎంత సపోర్ట్ చేశారో కరణ్ గతంలో చాలాసార్లు చెప్పారు.

మరోవైపు రేణు కూడా అప్పట్లో పవన్ కల్యాణ్ కోసం అదే విధంగా కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చేసేవారట. అయితే తనను కాస్ట్యూమ్ డిజైనర్‌గా పిలవడం కరెక్ట్ కాదని, తాను స్టైలిస్ట్ మాత్రమేనని స్పష్టం చేశారు. రంగులు, వాటికి సరిపోయే దుస్తులను ఎంపిక చేయడమే తన పని అని వివరించారు. కరణ్ కూడా షారూక్ విషయంలో ఇష్టంతోనే ఆ పని చేసేవారని చెప్పుకొచ్చారు.