రేణూ డెసిషన్ వెనుక రీజనేంటి?
ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన రేణూ దేశాయ్, పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టాక ఆయన్నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 21 Oct 2025 3:00 PM ISTఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన రేణూ దేశాయ్, పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టాక ఆయన్నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. పవన్ తో విడాకుల తర్వాత పూణెలో సెటిల్ అయిన రేణూ, ఎప్పుడూ ఏదొక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. గత కొంతకాలంగా యాక్టింగ్ కు దూరంగా ఉంటూ వస్తున్న రేణూ, మొన్నా మధ్య రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో కనిపించి ఆడియన్స్ ను అలరించిన విషయం తెలిసిందే.
యాక్టింగ్ అంటే ఇష్టం.. కానీ అదే టార్గెట్ కాదు!
టైగర్ నాగేశ్వరరావు చేస్తున్నప్పుడు తనపై ఎన్నో విమర్శలు వచ్చాయని, ఎక్కడ చూసినా తానే కనిపిస్తున్నానని, ఎలాంటి సినిమాల్లోనైనా నటిస్తానని అన్నారు. కానీ టైగర్ నాగేశ్వరరావు వచ్చి రెండేళ్లవుతుంది, అప్పట్నుంచి తాను మళ్లీ స్క్రీన్ పై కనిపించలేదని, గతంలో తనను విమర్శించిన వారెవరూ తనకు క్షమాపణలు చెప్పలేదని, మాట్లాడేవాళ్లు ఎలాగైనా మాట్లాడతారని, అందుకే తాను వాటిని పట్టించుకోనని, యాక్టింగ్ పై ఉన్న ఇష్టం వల్లే తాను ఆ సినిమా చేశానని, కానీ యాక్టింగే తన టార్గెట్ కాదని, ఒకవేళ యాక్టింగే తన టార్గెట్ అయితే తాను హీరోయిన్ అయనప్పటి నుంచి ఇప్పటివరకు సినిమాలు చేస్తూనే ఉండేదాన్నని, దాంతో తనకెంతో మంచి పేరు వచ్చుండేదని ఆమె పేర్కొన్నారు.
కరోనా టైమ్ లో నిశ్చితార్థం చేసుకున్న రేణూ
పవన్ నుంచి విడిపోయాక రేణూ పిల్లలతోనే ఉంటుంది తప్పించి మరో పెళ్లి చేసుకోలేదు. అందరిలానే తనక్కూడా ఓ తోడు కావాలని భావించిన రేణూ కరోనా టైమ్ లో ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ పవన్ ఫ్యాన్స్ దాటికి తట్టుకోలేక ఆమె తన ఎంగేజ్‌మెంట్ ను కూడా క్యాన్సిల్ చేసుకున్నానని ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు. ఎంగేజ్‌మెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నప్పటికీ తనకు రెండో పెళ్లి ఆలోచన ఉందని రేణూ పలుసార్లు చెప్పారు.
సన్యాసం తీసుకునే అవకాశాలున్నాయి
అలాంటి రేణు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాను ఒక సంవత్సరం మాత్రమే ఇలా ఉంటానని, ఆ తర్వాత సన్యాసం తీసుకుని ఆశ్రమానికి వెళ్లే అవకాశాలున్నాయని హింట్ ఇచ్చారు రేణూ. అయితే రేణూ సన్యాసం తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. రెండో పెళ్లికి సిద్ధమైన రేణూ ఇలా సడెన్ గా ఈ మాట చెప్పడం వెనుక ఉన్న రీజనేంటని నెటిజన్లు ఆలోచిస్తూ షాకవుతున్నారు. ఇక కెరీర్ విషయానికొస్తే తనకు ఇప్పుడు మంచి అవకాశాలొస్తున్నాయని, మహిళా ప్రాధాన్యమున్న సినిమాల్లో ఛాన్సులొస్తున్నాయని, తాజాగా ఓ సినిమాకు సైన్ చేశానని, అత్తా కోడళ్ల నేపథ్యంలో కామెడీ డ్రామాగా ఆ మూవీ తెరకెక్కనుందని ఆమె వెల్లడించారు.
