ఇదెక్కడి న్యాయం... రేణు దేశాయ్ ఆగ్రహం
ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి పనులకు సంబంధించిన వీడియోలను తొలగించి, బూతు వీడియోలు, ఫోటోలు ఉన్నివ్వడం ఎంత వరకు కరెక్ట్, అసలు ఇదెక్కడి న్యాయం అంటూ రేణు దేశాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
By: Ramesh Palla | 24 Aug 2025 3:57 PM ISTరేణు దేశాయ్ జంతు ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె రెగ్యులర్‌గా మూగ జీవుల గురించి సోషల్ మీడియా ద్వారా స్పందించడం మాత్రమే కాకుండా తనకు తోచిన సాయం చేయడం ద్వారా మూగ జీవులకు బాసటగా ఉంటుంది. మనుషుల వల్ల జంతువులు ఎంతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో కొన్ని జంతువులకు సంబంధించిన సమస్యలను జాతీయ స్థాయిలో చర్చ జరిగే విధంగా తీసుకు వెళ్లిన విషయం తెల్సిందే. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రెగ్యులర్‌గా జంతువుల గురించి స్పందించడం, అందుకు సంబంధించిన విషయాలను షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పై రేణు దేశాయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఇన్‌స్టాగ్రామ్‌పై రేణు దేశాయ్
జంతువులు ముఖ్యంగా కుక్కలకు సంబంధించిన సమస్యలు, అవి ఎదుర్కొంటున్న సమస్యలను గురించి రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోల రూపంలో, ఫోటోల రూపంలో షేర్ చేసే వారు. ఇప్పుడు ఆ వీడియోలు, ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ సెక్యూరిటీ గైడ్ లైన్స్ అంటూ తొలగించింది. ఆ వీడియోలను తొలగించడంపై రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది న్యూ0డ్ వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. వాటిని ఉంచి మంచి పనులకు సంబంధించిన వీడియోలను తొలగించడం ద్వారా ఇన్‌స్టాగ్రామ్ ఏం సందేశం ఇస్తుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రేణు దేశాయ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కాస్త సైలెంట్ అయ్యారు అనుకుంటున్న సమయంలో ఈ పోస్ట్ షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు.
వీధి కుక్కల ఇష్యూ
ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి పనులకు సంబంధించిన వీడియోలను తొలగించి, బూతు వీడియోలు, ఫోటోలు ఉన్నివ్వడం ఎంత వరకు కరెక్ట్, అసలు ఇదెక్కడి న్యాయం అంటూ రేణు దేశాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటి వరకు స్పందించలేదు. గత కొన్ని రోజులుగా ఇండియాలో వీధి కుక్కల ఇష్యూ జరుగుతున్న విషయం తెల్సిందే. అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ చాలా మంది సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వ గైడ్ లైన్స్ అనుగుణంగా ఇన్‌స్టాగ్రామ్ అలాంటి వీడియోలను తొలగించినట్లు తెలుస్తోంది. రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియోలను మాత్రమే కాకుండా చాలా మంది షేర్ చేసిన జంతువుల వీడియోలను సైతం డిలీట్ చేయడం జరిగిందని తెలుస్తోంది.
పవన్ మాజీ భార్య రేణు దేశాయ్
హీరోయిన్‌గా రేణు దేశాయ్ చేసిన సినిమాలు కొన్నే అయినా కూడా పవన్ కళ్యాణ్ మాజీ భార్య అనే ట్యాగ్ కారణంగా ఆమెకు చాలా పాపులారిటీ దక్కింది. ఇప్పటికీ ఆమెను పవన్ మాజీ భార్య అని పిలవడం ద్వారా ఎక్కువగా మీడియాలో రీచ్ ఉంటుందని కొందరు అంటూ ఉంటారు. పవన్ నుంచి విడిపోయిన తర్వాత సొంతంగా పిల్లలను పెంచుకుంటూ ఒంటరి జీవితాన్ని సాగిస్తున్న రేణు దేశాయ్‌ని కొందరు సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా విమర్శించడం, కొన్ని విషయాల్లో టార్గెట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ విషయంలో ఆమెను కొందరు విమర్శిస్తూ ఉంటే, కొందరు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి ఈ విషయంలో రేణు దేశాయ్ మాత్రమే కాకుండా మరికొంత మంది సైతం ఇన్‌స్టాగ్రామ్ తీరుపై కోపంతో ఉన్నారు.
