Begin typing your search above and press return to search.

ఆయనే మిమ్మల్ని గమ్యానికి చేరుస్తారు!

ఇదిలా ఉండగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయంపై స్పందించే రేణు దేశాయ్ తాజాగా డివోషనల్ ట్రిప్ వెళ్ళింది.

By:  Madhu Reddy   |   13 Nov 2025 6:00 PM IST
ఆయనే మిమ్మల్ని గమ్యానికి చేరుస్తారు!
X

గ్లామర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా.. ఎక్కువగా సమాజంలో జరిగే పలు అంశాలపై స్పందించే అతి కొద్దిమంది సెలబ్రిటీలలో రేణూ దేశాయ్ కూడా ఒకరు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సహజీవనం చేసి ఒక కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత.. కొడుకు సమక్షంలో పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకున్న రేణు దేశాయ్.. కూతురు ఆధ్యాకు జన్మనిచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయింది. ప్రస్తుతం పూణేలో సెటిల్ అయిన ఈమె తన ఇద్దరి పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ కెరియర్ ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.




అంతేకాదు పలు ఎన్జీవో సంస్థలను కూడా నిర్వహిస్తూ వాటికి అవసరమైన డబ్బులను కూడా చందాల రూపంలో అభిమానులను అడుగుతూ అవసరాలు తీరుస్తూ ఉంటుంది. అంతేకాదు తన సంపాదనలో ప్రతినెల కొంత మొత్తాన్ని ఇలా కుక్కల పెంపకం కోసం కేటాయిస్తూ వాటి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలపై కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది..




ఇదిలా ఉండగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయంపై స్పందించే రేణు దేశాయ్ తాజాగా డివోషనల్ ట్రిప్ వెళ్ళింది. అందులో భాగంగానే అందుకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ కొటేషన్ కూడా పంచుకుంది. ఆయనే మిమ్మల్ని గమ్యానికి చేరుస్తారు.. ఆయన పిలిస్తే ఎవరైనా వెళ్లాల్సిందే అంటూ తెలిపింది రేణు దేశాయ్. అసలు విషయంలోకి వెళ్తే ట్రిప్ కి బయలుదేరిన ఈమె అక్కడ నుంచి కొన్ని ఫోటోలను పంచుకుంది




ఈ ఫోటోల కింద రేణు దేశాయ్.." ఈరోజు కాలభైరవ జయంతి. అయితే ఈ రోజున మనం రక్షణ కోరకూడదు. మనమే రక్షకుడిగా మారాలి. భైరవుడు మీతో పాటు నడుస్తూ శాంతి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ పరమశివుడు పిలిచినప్పుడు మీరు అన్ని వదిలేసి కాశీ వెళ్తారు. ఆయనే మీకు మార్గాన్ని చూపిస్తారు" అంటూ తెలిపింది రేణు దేశాయ్. మొత్తానికైతే ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా శివాజ్ఞ లేనిదే ఏమీ జరగదని.. మనల్ని ఎప్పుడు.. ఎక్కడికి.. ఎలా చేర్చాలో అన్ని ఆయనకు తెలుసు అని చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నా.

రేణు దేశాయ్ కాస్ట్యూమ్ డిజైనర్ గా తన కెరీర్ ను ఆరంభించక ముందే మోడల్ గా పనిచేసింది. ఆ తర్వాత హీరోయిన్ గా చిత్రాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. అసలు విషయంలోకి వెళ్తే.. 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు అనే చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే ఏడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమకు తీసింది. ఇక రేణు దేశాయ్ పవన్ తో సహజీవనం మొదలుపెట్టిన తర్వాత మళ్లీ సినిమాలలో నటించలేదు కానీ 2003లో వచ్చిన జానీ సినిమాలో మాత్రమే నటించింది.