'బద్రి' త్రోబ్యాక్ పిక్.. రేణు సడెన్ పోస్ట్కు అర్థమేంటి?
పాత ఫొటోను షేర్ చేస్తే పాత మెమోరీస్ గుర్తొస్తాయి. కానీ ఆ ఫొటోతో పాటు మనసులోని మాటను షేర్ చేసుకుంటే మాత్రం కొత్త చర్చ మొదలవుతుంది.
By: M Prashanth | 17 Oct 2026 8:43 PM ISTపాత ఫొటోను షేర్ చేస్తే పాత మెమోరీస్ గుర్తొస్తాయి. కానీ ఆ ఫొటోతో పాటు మనసులోని మాటను షేర్ చేసుకుంటే మాత్రం కొత్త చర్చ మొదలవుతుంది. ఇప్పుడు సీనియర్ నటి రేణు దేశాయ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. పవన్ కల్యాణ్ తో కలిసి ఆమె నటించిన 'బద్రి' సినిమా నాటి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి ఓ ఇంట్రెస్టింగ్ కోట్ ను యాడ్ చేశారు. దీంతో ఆ పాత ఫొటో కంటే ఆమె క్యాప్షన్ పైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది.
రేణు దేశాయ్ రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఆ ఫొటోను రీల్ లా షేర్ చేశారు. నల్లటి లెదర్ జాకెట్, మ్యాచింగ్ ప్యాంట్ తో స్టైలిష్ గా కనిపిస్తున్న ఆమె లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆ ఫొటో 2000లో విడుదలైన 'బద్రి' సినిమాలోని 'బంగాళా కతంలో' పాటలోనిది. పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ కలిసి నటించిన ఆ సినిమా అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ సినిమా నాటి ఫొటోను చూడటంతో అభిమానులకు పాత మెమోరీస్ మరోసారి గుర్తుకొస్తున్నాయి.
అయితే ఆ ఫొటోతో పాటు రేణు రాసిన క్యాప్షన్ ఇప్పుడు అసలు చర్చకు కారణమైంది. 'నాకు శత్రువులు అవసరం లేదు.. నా సొంత నిర్ణయాలే నాకు చాలు' అనే అర్థం వచ్చేలా ఆమె ఓ కోట్ ను షేర్ చేశారు. దానికి తన స్నేహితురాలు ఆ ఆలోచనను తనతో పంచుకుందని కూడా చెప్పారు. మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలే కొన్నిసార్లు మనకు ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చనే అర్థం ఆ క్యాప్షన్స్ లో కనిపిస్తోంది.
అయితే రేణు దేశాయ్ ఆ పోస్ట్ ను ఏ సందర్భంలో పెట్టారనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఆమె పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఏదైనా విషయాన్ని ఉద్దేశించి అలా క్యాప్షన్స్ రాశారా, లేక నచ్చిన ఆలోచనను అభిమానులతో షేర్ చేసుకున్నారా అనేది తెలియదు. మరోవైపు రేణు దేశాయ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో నటిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె.. ఇప్పుడు యాక్టింగ్ తోపాటు రైటింగ్ పై కూడా ఫోకస్ పెట్టారు.
'కాశీ మజిలీ' సినిమాలో కీలక పాత్ర పోషించడంతో పాటు స్టోరీ, డైలాగ్స్ కూడా అందించారు. ఈ సినిమా ఈటీవీ విన్లో అందుబాటులో ఉంది. అలాగే కృష్ణ దమ్మాలపాటి దర్శకత్వంలో రూపొందుతున్న '16 రోజుల పండుగ' సినిమాలో ప్రస్తుతం యాక్ట్ చేస్తున్నారు. వీటితో పాటు అత్తా, కోడళ్ల మధ్య సాగే ఓ ఫ్యామిలీ స్టోరీతో రూపొందుతున్న మూవీలో అత్త పాత్రలో కనిపించనున్నారు.
ఇలా ఓవైపు కొత్త సినిమాలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్న రేణు.. మరోవైపు సోషల్ మీడియాలో తన ఆలోచనలను పంచుకుంటున్నారు. ఇప్పుడు 'బద్రి' నాటి ఫొటోతో ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ క్యాప్షన్ వెనుక ప్రత్యేక ఉద్దేశం ఉందా, లేక ఫ్రెండ్ కామెంట్ నచ్చి షేర్ చేశారా అనేది రేణు దేశాయ్ రెస్పాండ్ అయితేనే తెలుస్తుంది.
