శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!
పవన్ కళ్యాణ్‌తో విడిపోయి 14 ఏళ్లు గడిచినా, తెలుగు ప్రేక్షకులు తనను ఇప్పటికీ ఆయన గత సంబంధంతోనే గుర్తిస్తున్నారని రేణూ దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. విడాకుల తర్వాత సినిమాలు నిర్మించడం, దర్శకత్వం వహించడం, కవితలు రాయడం, డ్యాన్స్ షోల్లో పాల్గొనడం వంటి పనులు చేసినా తనకంటూ గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. తన 14 ఏళ్ల వనవాసం ఎప్పుడు ముగుస్తుందని పాడ్‌కాస్ట్‌లో ప్రశ్నించారు.
By: Priya Chowdhary Nuthalapti | 6 Nov 2026 2:48 PM ISTసినిమా రంగంలో సెలబ్రిటీలుగా గుర్తింపు తెచ్చుకోవడం ఎంత కష్టమో, ఆ గుర్తింపును వ్యక్తిగత జీవితానికి సంబంధం లేకుండా కాపాడుకోవడం కూడా అంతే కష్టం. రేణు దేశాయ్ ప్రస్తుతం ఇది సమస్య ఎదుర్కొంటుంది.
పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ 2012లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్య ఉన్నారు. విడాకుల తర్వాత రేణూ దేశాయ్ తన జీవితంలో ఎన్నో కొత్త పనులు ప్రారంభించారు. సినిమాలు నిర్మించడం, దర్శకత్వం వహించడం, కవితలు రాయడం, టీవీ షోల్లో పాల్గొనడం వంటి అనేక రంగాల్లో తన ప్రతిభను చూపించారు. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లో కొందరు తనను పవన్ కళ్యాణ్‌తో ఉన్న గత సంబంధం ద్వారానే గుర్తిస్తున్నారని ఆమె చెప్పారు.
తాజాగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రేణూ దేశాయ్ తన మనసులోని బాధను బయటపెట్టారు. తన జీవితాన్ని తెలుగు ప్రేక్షకులు ఎలా చూస్తున్నారో వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"తెలుగు వాళ్లకు నా జీవితం గురించి ఒక విషయం చెప్పాలి. నేను 1999 జూన్‌లోనే పుట్టినట్లు చాలామంది భావిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమా కోసం హైదరాబాద్‌కు వచ్చినప్పటి నుంచే నా జీవితం మొదలైనట్లు చూస్తున్నారు. అంతకుముందు నాకు ఎలాంటి జీవితం లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు" అని అన్నారు.
అంతేకాదు, తన పరిస్థితిని శ్రీరాముడి వనవాసంతో పోల్చారు. "ఇప్పటికే 14 ఏళ్లు గడిచిపోయాయి. శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసంలో ఉన్నారు. మరి నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?" అంటూ ప్రశ్నించారు.
విడాకుల తర్వాత తాను సాధించిన విజయాలను కూడా ఆమె గుర్తు చేసుకున్నారు.
"2012లోనే మాకు విడాకులు అయ్యాయి కదా! ఆ తర్వాత నేను ఒక మరాఠీ సినిమాను నిర్మించాను. అది మంచి విజయాన్ని అందుకుంది. మరో సినిమాకు కథ రాసి, నిర్మించి, దర్శకత్వం కూడా వహించాను. డ్యాన్స్ షోలో పాల్గొన్నాను. కవితలు రాశాను. ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నాను. నేను ఎవరూ కాకపోతే నన్ను పనుల కోసం ఎందుకు పిలుస్తారు?" అని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శల గురించి కూడా రేణూ మాట్లాడారు. జంతువుల పట్ల ప్రేమ చూపిస్తూ వాటిని రక్షించడానికి ప్రయత్నించినా కొందరు తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పారు.
"నేను ఒక కుక్కను కాపాడితే కూడా నన్ను తిడుతున్నారు. అతను లేకపోతే ఆమెకు బతకడానికి ఏమీ లేదా అన్నట్లుగా మాట్లాడుతున్నారు" అని తన బాధను వ్యక్తం చేశారు.
