22 వయసుకే ఆత్మహత్య.. శ్రీదేవి-భానుప్రియ రేంజు నటి
ఒక నటి తనదైన అందం, నట ప్రతిభతో దశాబ్ధాల పాటు గుర్తుండిపోవడం అంటే అంత సులువు కాదు.
By: Sivaji Kontham | 7 Aug 2025 8:15 AM ISTఒక నటి తనదైన అందం, నట ప్రతిభతో దశాబ్ధాల పాటు గుర్తుండిపోవడం అంటే అంత సులువు కాదు. లైమ్ లైట్ లో ఉన్నా లేకపోయినా ప్రజలు ఆ నటి గురించి పదే పదే మాట్లాడుకుంటున్నారు! అంటే అంతగా తన నటప్రతిభతో ప్రభావం చూపితేనే ఇది పాజిబుల్. అతిలోక సుందరి శ్రీదేవి మన మధ్య లేకపోయినా ఏదో ఒక సందర్భంలో ఆ పేరు తలవనిదే ముందుకు సాగలేం. ప్రపంచవ్యాప్తంగా శ్రీదేవికి ఉన్న అభిమానులు ఏదో ఒక క్షణంలో తనను తలుచుకుంటూనే ఉన్నారు. తెరపై శ్రీదేవి కుమార్తెలను చూసినప్పుడో లేదా భర్త బోనీని చూసినప్పుడో తలచుకోకుండా ఉండలేరు.
శ్రీదేవిలా మర్చిపోలేని పేరు:
శ్రీదేవి తర్వాత భానుప్రియ, రాధిక, జయసుధ, రాధ, విజయశాంతి లాంటి నటీమణుల విషయంలో ఎంతో గొప్పగా చెప్పుకుంటారు తెలుగు ప్రజలు. వారంతా తమదైన నటప్రతిభతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇప్పుడు మలయాళంలో ఒక ప్రముఖ నటి తనదైన అందం, నట ప్రతిభతో ఆకట్టుకుని ఆ తర్వాత అర్థాంతరంగా కేవలం 22 వయసులో ఆత్మహత్య చేసుకుని వెళ్లిపోవడం ఎందరినో కలచివేసింది.
ఎవరు ఈ ఆకాశ గంగ?
ఆ నటి పేరు మయూరి. మలయాళంలో పాపులర్ కథానాయిక. ఆత్మ ఆవహించే గంగ పాత్రలో నటించింది. ఆ పాత్రతోనే కాదు, మాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. మలయాళ హారర్ చిత్రం ఆకాశ గంగ (1999)లో మయూరి అత్యుత్తమ నట ప్రదర్శనను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. దెయ్యం ప్రతీకారం నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రంలో దివ్య ఉన్ని ఆత్మ ఆవహించిన స్త్రీగా నటిస్తుంది. దివ్య ఆత్మగా కనిపిస్తే, నిజమైన (జీవించి ఉన్న) గంగగా మయూరి అద్భుత నటన, ఆహార్యం కట్టి పడేసాయి. ప్రేక్షకుల హృదయాల్లో మయూరికి శాశ్వత ఇమేజ్‌ను ఇచ్చిన చిత్రమిది. ఆ తర్వాత కూడా మయూరి నటించిన దాదాపు ప్రతి సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే మయూరి 22 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకున్నా కానీ, రెండు దశాబ్ధాల తర్వాత కూడా ఇప్పటికీ గుర్తుండిపోయింది.
తొలి ప్రయత్నమే ఒక మెరుపు:
1983లో కోల్‌కతాలో తమిళ జంటకు జన్మించిన మయూరి 8వ తరగతి చదువుతున్నప్పుడు తన తొలి చిత్రం `కుంభకోణం గోపాలు`లో పాండియరాజన్ సరసన కథానాయికగా నటించింది. యుక్తవయసులో అమ్మాయి నర్సుగా పరిణతి చెందిన నటనతో మెప్పించింది. మయూరి తెరపై పేరు కాగా నీ షాలిని అనేది తన అసలు పేరు. ధనుష్, మోహన్ లాంటి వంటి పెద్ద హీరోలతో కలిసి నటించింది. చాలా తక్కువ సమయంలో అరడజను పైగానే చిత్రాల్లో నటించిన మయూరి సడెన్ గా 22 వయసులో ఆత్మహత్య చేసుకుని అంతర్థానం కావడం అభిమానుల హృదయాలను కలచి వేసింది.
