Begin typing your search above and press return to search.

ప్రేమ, పెళ్లి పై రేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

బాలీవుడ్ లెజెండరీ నటి, ఎవర్ గ్రీన్ బ్యూటీ రేఖ అద్భుతమైన నటనతోనే కాదు జీవిత అనుభవాలతో, విభిన్నమైన తత్వంతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.

By:  Srikanth Kontham   |   15 Aug 2026 4:00 AM IST
ప్రేమ, పెళ్లి పై రేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!
X

బాలీవుడ్ లెజెండరీ నటి, ఎవర్ గ్రీన్ బ్యూటీ రేఖ అద్భుతమైన నటనతోనే కాదు జీవిత అనుభవాలతో, విభిన్నమైన తత్వంతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా రేఖ‌ ప్రేమ ..వివాహ వ్యవస్థపై వ్యక్తం చేసిన ఆసక్తికర భావాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాజం ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తున్న సంప్రదాయ భావనలకు భిన్నంగా ప్రేమ , శాశ్వత బంధంపై ఆమె చెప్పిన మాటలు సినీ వర్గాలను, ప్రేక్షకులను ఎంతగానో ఆలోచింప జేస్తున్నాయి. ఓ సందర్భంలో ప్రేమ గురించి మాట్లాడుతూ తాను సోల్ మేట్స్ (ఆత్మ బంధువులు) మీద, శాశ్వతమైన ప్రేమ మీద అపారమైన నమ్మకం ఉంచానని రేఖ స్పష్టం చేశారు.

కానీ అదే సమయంలో సాంప్రదాయబద్ధమైన శాశ్వతమైన వివాహం అనే భావనపై తనకు భిన్నమైన అభిప్రాయం ఉందని పేర్కొన్నారు. పెళ్లి అనే బంధం కంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే మానసిక అనుబంధం, ఆత్మీయతే నిజమైన ప్రేమకు అసలైన అర్ధమని చెప్పకనే చెప్పారు. సమాజంలో చాలామంది పెళ్లిని శాశ్వత బంధంగా భావిస్తారని కానీ బంధాలు కేవలం కాగితాలపై సంతకాలతో లేదా చట్టపరమైన నిబంధనలతో ముడిపడి ఉండవని రేఖ అభిప్రాయపడ్డారు. ప్రేమ అనేది ఎవరికీ బందీ కాదని అది స్వచ్ఛమైన భావన అని పేర్కొన్నారు.

ఒకరినొకరు అర్థం చేసుకునే ఆత్మల కలయికే నిజమైన బంధమని, దానిని ఏ బంధనాలతోనూ కట్టేయలేమని తనదైన శైలిలో వివరించారు. రేఖ వ్యక్తిగత జీవితం ఎన్నో ఒడిదుడుకులతో, విషాదాలతో ముడిపడి ఉందనే సంగతి తెలిసిందే. ఆమె జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల సారాంశమే ఈ పరిణతి చెందిన ఆలోచనలకు కారణమని విశ్లేషకులు అభిప్రా యపడుతున్నారు. సమాజం ఏమనుకుంటుందనే దానికంటే? తన అంతరార్థానికి, మనస్సాక్షికి తగినట్లుగా జీవించడమే గొప్ప విషయమని రేఖ‌ జీవితం నిరూపించింది.

ఈ తరానికి చెందిన యువత ప్రేమను తాత్కాలిక ఆకర్షణగా చూస్తున్న తరుణంలో రేఖ చెప్పిన మాటలు ప్రేమ లోని లోతును తెలియజేస్తున్నాయి. ప్రేమలో నిజాయితీ, అంకితభావం ఉండాలే తప్ప, అది ఏ బంధనంలోనూ ఇరుక్కోకూడదనే రేఖ‌ భావన నేటి ఆధునిక యువత ఆలోచనా విధానానికి అద్దం పడుతోంది. ఎవరికైనా స్వేచ్ఛనిస్తూనే ప్రేమను పంచడం ఎలాగో ఆమె మాటలు నేర్పుతాయి. మొత్తంగా రేఖ అందించిన ప్రేమ సందేశం ఒక సినీ తార చెప్పిన మాటలా కాకుండా జీవితాన్ని దగ్గరగా చూసిన ఒక అనుభవజ్ఞురాలి తత్వశాస్త్రంగా నిలిచింది. సమాజంలోని సంప్రదాయ భావనలను ప్రశ్నిస్తూ మనిషి అంతరత్మను తాకేలా చెప్పిన సూత్రాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.