Begin typing your search above and press return to search.

రీఎంట్రీకి రెడీ అయిన మ‌రో హీరోయిన్

కానీ 2014 త‌ర్వాత రేఖ ప‌ర్స‌న‌ల్ రీజ‌న్స్ మ‌రియు హెల్త్ ఇష్యూస్ కార‌ణంగా రెస్ట్ తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకుని, సినీ ఇండ‌స్ట్రీకి దూర‌మైంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   21 Aug 2025 7:00 AM IST
రీఎంట్రీకి రెడీ అయిన మ‌రో హీరోయిన్
X

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎవ‌రెప్పుడు ఎలా మెరిసి, ఎలా స‌డెన్ గా క‌నుమ‌రుగైపోతారో చెప్ప‌లేం. మ‌రీ ముఖ్యంగా హీరోయిన్లు. కొంద‌రు హీరోయిన్లకు స‌క్సెస్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఇండ‌స్ట్రీలో క‌నిపించ‌రు. దానికి ఎన్నో ర‌కాల కార‌ణాలుండొచ్చు. అలాంటి ఓ హీరోయినే న‌టి రేఖ‌. శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చి మొద‌టి సినిమా ఆనందంతో ఎంతో మందిని మెప్పించిన రేఖ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ప‌రిచ‌య‌స్తురాలే.

ఏ స‌పోర్ట్ లేకుండానే..

ఆనందం సినిమా స‌క్సెస్ త‌ర్వాత తెలుగులో దొంగోడు, ఒక‌టో నెం. కుర్రాడు, జాన‌కి వెడ్స్ శ్రీరామ్ లాంటి హిట్ సినిమాల్లో క‌నిపించిన రేఖ కొంత‌కాలానికి తెలుగు సినిమాకు దూర‌మై లైమ్ లైట్ లో క‌నిపించ‌కుండా పోయింది. క‌ర్ణాట‌క‌కు చెందిన రేఖ చిన్న ఏజ్ లోనే సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన రేఖకు అదే టైమ్‌లో క‌న్న‌డ ఇండ‌స్ట్రీ నుంచి కూడా ఆఫ‌ర్లు రావ‌డం మొద‌లుపెట్టాయి.

ప‌ర్స‌న‌ల్ రీజ‌న్స్ వ‌ల్ల ఇండ‌స్ట్రీకి దూరం

కానీ 2014 త‌ర్వాత రేఖ ప‌ర్స‌న‌ల్ రీజ‌న్స్ మ‌రియు హెల్త్ ఇష్యూస్ కార‌ణంగా రెస్ట్ తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకుని, సినీ ఇండ‌స్ట్రీకి దూర‌మైంది. అలాంటి రేఖ ఇప్పుడు తిరిగి యాక్టింగ్ ను కంటిన్యూ చేయాల‌ని డిసైడైంది. అందులో భాగంగానే టాలీవుడ్ లోకి కంబ్యాక్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. న‌టిగా త‌న‌ను ఛాలెంజ్ చేసే పాత్ర‌ల కోసం రేఖ ఇప్పుడు వెతుకుతున్న‌ట్టు స‌మాచారం.

సినిమాల్లోనే కాకుండా ఓటీటీ షో ల‌లో ఏదైనా ప‌వ‌ర్‌ఫుల్ రోల్స్ ఉన్నా చేయ‌డానికి రెడీ అంటోంది రేఖ‌. అందులో భాగంగానే రేఖ రీసెంట్ గా త‌న పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను కూడా ఓపెన్ చేసి, దాని ద్వారా ఫ్యాన్స్ కు రెగ్యుల‌ర్ గా ట‌చ్ లో ఉంటుంది. అయితే ఇన్నేళ్ల త‌ర్వాత కూడా రేఖ అంతే అందంతో క‌నిపిస్తూ అదే ఆక‌ర్ష‌ణ‌తో ఆడియ‌న్స్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. మ‌రి త‌ను కోరుకున్న కంబ్యాక్ రేఖ‌కు ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.