అభిమానికి అలా టచ్ లోకి వెళ్లి పెళ్లి!
రేఖ- ఢిల్లీకి చెందిన వ్యాపార వేత్త ముఖేష్ అగర్వాల్ ను వివాహం చేసుకోవడం..పెళ్లై నెలల వ్యవధిలోనే అతడు ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో ఓ సంచలనం.
By: Srikanth Kontham | 19 Dec 2025 9:00 PM ISTసెలబ్రిటీ లైఫ్ అంటే ఎంతో ఖరీదైంది. ఎప్పుడూ ఫేం..డబ్బు చుట్టూనే తిరుగుతుంది. అభిమానులు సెలబ్రిటీలకు కట్టబెట్టిన స్థానం అలాంటింది. ప్రపంచంలో ఖరీదైన అభిమానులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఓ అభిమానిని నటి పెళ్లిచేసుకున్న సంఘటనలు మాత్రం ఎక్కడా పెద్దగా కనిపించవు. తాజాగా బాలీవుడ్ లెజెండరీ నటి రేఖ వివాహం గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. రేఖ- ఢిల్లీకి చెందిన వ్యాపార వేత్త ముఖేష్ అగర్వాల్ ను వివాహం చేసుకోవడం..పెళ్లై నెలల వ్యవధిలోనే అతడు ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో ఓ సంచలనం.
తాజాగా వీరిద్దరి వివాహం గురించి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ బినా రమణి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేసారు. `ముకేష్ అగర్వాల్ తో వివాహం కంటే ముందు రేఖ బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ ని ప్రేమించారు. కానీ అమితాబ్ తో అది సాధ్యం కాదని తెలుసుకుని అప్పటికే రేఖ నిరాశలో ఉన్నారు. ఆ సమయంలోనే రేఖ జీవితంలోకి ముఖేష్ అగర్వాల్ ఓ అభిమానిగా ఎంటర్ అయ్యారు. రేఖకు అతడు వీరాభిమాని. రేఖ నటించిన ఏ సినిమా డైలాగులు అయినా అవలలీగా చెప్పగలడు. రేఖ గురించి సమస్త సమాచారం తెలుసుకున్నాడు.
ఆ సమయంలో రేఖ- ముకేష్ అగర్వాల్ ని కలిపింది తానేనంటూ బీనా తాజాగా వెల్లడించారు. ఓ ఫోన్ కాల్ ద్వారా పరిచయం చేసానన్నారు. `రేఖ అతడితో కొన్ని నిమిషాలు కాల్ కట్ చేసారు. అతడి నెంబర్ తీసుకున్నారు. తన నెంబర్ మాత్రం ఇవ్వొద్దని ఆదేశించింది. ఆ తర్వాత రేఖ స్వయంగా ముకేష్ అగర్వాల్ కి కాల్ చేసింది. ఈ విషయం రేఖ చెప్పడంతోనే నాకు తెలిసింది. ఇద్దరు వేర్వేరు వృత్తుల్లో ఉన్నారు. ఆలోచనలు, వ్యక్తిత్వలు కూడా భిన్న మైనవి. ఇద్దరి ఫోటోలు పక్క పక్కనే పెట్టి నా పక్కన ఇతడిని ఊహించుకోగలనా? అని రేఖ అడింది.
అప్పటికీ అమితాబ్ ని ఎంతగానే ప్రేమిస్తుంది. కానీ ముకేష్ చూపించిన ప్రేమకు రేఖ కరిగిపోయింది. అతడి ప్రేమ ఊరటనిచ్చింది. దీంతో అప్పటికప్పుడు వివాహం చేసుకున్నారు. అది తెలిసి నేను కూడా షాక్ అయ్యాను` అని తెలిపారు. 1990లో రేఖ, ముఖేశ్ అగర్వాల్ వివాహం జరిగింది. అనంతరం ముఖేష్ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పటిక మిస్టరీనే. అనంతరం రేఖ 1973లో హీరో వినోద్ మెహ్రాను మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు బీ టౌన్ లో ఓ టాక్. వినోద్ మోహ్రా కూడా గుండెపోటుతో మరణించాడు.
