Begin typing your search above and press return to search.

రెహ్మాన్ డెకాయిత్‌కి అబ్రార్‌కి ఊహించ‌ని చిక్కులు?

రెహ్మాన్ డెకాయిత్ పాత్ర ఒక ర‌కంగా నిర్జీవంగా ఉన్న‌ అత‌డి కెరీర్ కి పున‌రుజ్జీవ‌నాన్ని ఇచ్చింది.

By:  Sivaji Kontham   |   12 July 2026 2:29 PM IST
రెహ్మాన్ డెకాయిత్‌కి అబ్రార్‌కి ఊహించ‌ని చిక్కులు?
X

`దురంధ‌ర్` చిత్రంలో పాకిస్తాన్ క‌రాచీ-లియారీ అనే ప‌ట్ట‌ణానికి చెందిన‌ రెహ్మాన్ డెకాయిత్ అనే గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో న‌టించారు అక్ష‌య్ ఖ‌న్నా. ఈ పాత్ర‌లో అత‌డి అభినివేశానికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఆ పాత్ర అత‌డి కోస‌మే పుట్టిందా? ఆ పాత్ర‌కోస‌మే అత‌డు పుట్టాడా? అనేంత‌గా ప్ర‌జ‌ల‌కు క‌నెక్ట‌యిపోయింది. 3000 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాలో అక్ష‌య్ ఖ‌న్నా భాగ‌మ‌య్యాడ‌ని అభిమానులు సంబ‌రాలు చేసుకున్నారు. మాస్ లో ఖ‌న్నా ఇమేజ్ గ్రాఫ్ ని అమాంతం పెంచేసింది ఈ న‌ట‌న‌..అభినివేశ‌నం.

రెహ్మాన్ డెకాయిత్ పాత్ర ఒక ర‌కంగా నిర్జీవంగా ఉన్న‌ అత‌డి కెరీర్ కి పున‌రుజ్జీవ‌నాన్ని ఇచ్చింది. యానిమ‌ల్ లో అబ్రార్ పాత్ర‌తో బాబి డియోల్ ఎలా కంబ్యాక్ అయ్యాడో, దురంధ‌ర్ లో రెహ్మాన్ డెకాయిత్ పాత్ర‌తో అక్ష‌య్ ఖ‌న్నా కూడా అలాగే గ్రేట్ కంబ్యాక్ అంటే ఏంటో చూపించాడు. ఈ పెర్ఫామెన్స్ త‌ర్వాత ఎడా పెడా అత‌డు చాలా చిత్రాల‌కు సంత‌కాలు చేసేసాడు. వ‌రుస పెట్టి అడ్వాన్సులు అందుకున్నాడు.

అయితే ఆ పాత్ర ప్ర‌భావ‌మో ఏమో కానీ, దురంధర్ కి ముందు, దురంధ‌ర్ కి త‌ర్వాత అక్ష‌య్ ఖ‌న్నా జీవితం కెరీర్ మారిపోయాయి. అంతేకాదు అత‌డు ఊహించ‌ని కాంప్లికేష‌న్ లో ప‌డ్డాడు. ముఖ్యంగా అత‌డు ఎంపిక చేసుకునే పాత్ర‌ల్లో ఏం తేడా ఉన్నా జ‌నం వెంట‌నే ఎటాక్ చేస్తున్నారు. ఇప్ప‌టికీ రెహ్మాన్ డెకాయిత్ ని గుర్తు చేసుకుని నెటిజ‌నులు విమ‌ర్శిస్తున్నారు. అస‌లు అక్ష‌య్ ఖ‌న్నా న‌ట‌న ఇటీవ‌లి కాలంలో ఎవ‌రికీ రుచించ‌డం లేదు. దీని ప్ర‌భావం తాజా చిత్రం `ఇక్కా`పై ప‌డింది. ఇందులో అక్ష‌య్ ఖ‌న్నా న‌ట‌న చాలా మందికి న‌చ్చ‌లేదు. అత‌డి అభిమానుల వ‌ర‌కూ స‌మ‌ర్థిస్తున్నా కానీ, స‌గ‌టు ఆడియెన్ కి మాత్రం రుచించ‌డం లేదు. ఇది ఒక ఊహించ‌ని ప‌రిణామం. కానీ త‌ప్ప‌దు.. దీనిని అత‌డు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అందుకే ఇక‌పై అత‌డు ఎంపిక చేసుకునే పాత్ర‌లు రెహ్మాన్ డెకాయిత్ ని మించి ఉండాల్సిన ప‌రిస్థితి ఉంది. అలా కాకుండా ఏవైనా నాశిర‌కం పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటే అత‌డు దిగ‌జారిపోవ‌డం గ్యారెంటీ. అంతగా ఖ‌న్నాను వెంబ‌డించి ఎటాక్ చేస్తున్నారు నెటిజ‌నులు. తాజా వివాదం నేపథ్యంలో, ఆయన భవిష్యత్తులో ఎంచుకునే కథలు, పాత్రల వైవిధ్యంపై ప్రేక్షకులు-సినిమా విశ్లేషకులు మరింత నిశితంగా దృష్టి సారించే అవకాశం ఉంది.

స‌రిగ్గా ఇలాంటి ప‌రిస్థితుల‌నే `యానిమ‌ల్` అబ్రార్ పాత్ర త‌ర్వాత బాబి డియోల్ త‌న ఇత‌ర సినిమాల విష‌యంలోను ఎదుర్కొన్నాడు. అత‌డు న‌టించిన కొన్ని ద‌క్షిణాది చిత్రాల్లో న‌ట‌న జ‌స్ట్ యావ‌రేజ్ మాత్ర‌మేన‌ని అభిమానులు అన్నారు. చాలా సినిమాల స‌మీక్ష‌ల్లో క్రిటిక్స్ విశ్లేషిస్తూ .. త‌న పాత్ర ప‌రిధి మేర‌కు బాగానే చేసాడు! అంటూ జ‌న‌ర‌లైజ్ చేస్తున్నారు త‌ప్ప మ‌రో అబ్రార్ క‌నిపించాడు! అని మాత్రం ఎక్క‌డా ప్ర‌శంసించ‌లేదు. రెహ్మాన్ డెకాయిత్, అబ్రార్ పాత్ర‌ల‌ను చేసిన ఖ‌న్నా, బాబి ఒక ర‌కంగా విచిత్ర‌మైన ప‌రిస్థితుల‌నే ఎదుర్కొంటున్నారు. వీట‌న్నిటి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఆ ఇద్ద‌రికీ పాథ్ బ్రేకింగ్ రోల్ ని అందించే క్రియేటివ్ డైరెక్ట‌ర్ ఎవ‌రున్నారో వేచి చూడాలి.