Begin typing your search above and press return to search.

ఆ బ్యూటీ ట‌చ్ చేయ‌ని ఏకైక ఇండ‌స్ట్రీ!

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా కెరీర్ ను ముందుకు తీసుకెళ్లోంది రెజీనా క‌సాండ్రా.

By:  Srikanth Kontham   |   22 Feb 2026 10:00 PM IST
ఆ బ్యూటీ ట‌చ్ చేయ‌ని ఏకైక ఇండ‌స్ట్రీ!
X

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా కెరీర్ ను ముందుకు తీసుకెళ్లోంది రెజీనా క‌సాండ్రా. ఏభాష‌లో అవ‌కాశం వ‌చ్చినా కాద‌న‌కుండా ప‌నిచేస్తోంది. ఇప్ప‌టికే సౌత్ నుంచి తెలుగు, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లో ఎన్నో చిత్రాల్లో నటించింది. వాటిలో కొన్ని విజ‌యం సాధించాయి. మ‌రికొన్ని ఫెయిల‌య్యాయి. కానీ ఆ మూడు ప‌రిశ్ర‌మ‌ల్లో ఏనాడు ఖాళీగా లేదు. టాలీవుడ్ కాక‌పోతో శాండిల్ వుడ్ ఈ రెండు కాక‌పోతే కోలీవుడ్ అంటూ అవ‌కాశాలు అందుకుంటూ ముందుకు సాగుతోంది. పారితోషికం ప‌రంగా ఎలాంటి డిమాండ్ చేయ‌కుండా ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు అందుబాటులో ఉంటుంది.

అమ్మ‌డిలో ఈర‌క‌మైన ల‌క్ష‌ణం కూడా క‌లిసొచ్చింది. ఈ మ‌ధ్య కాలంలో బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది. కెరీర్ ఆరంభంలోనే ఓ హిందీ సినిమా చేసినా త‌ర్వాత కొన‌సాగ‌లేదు. ఇలా ప్ర‌ధాన‌మైన భాష‌ల‌న్నింటిలోనూ రెజీనా ప‌ని చేసింది. కానీ అమ్మ‌డు ట‌చ్ చేయ‌ని ఓ ఫేమ‌స్ ఇండ‌స్ట్రీ ఒక‌టుంది. అదే మాలీవుడు. అవును రెజీనా ఇంత వ‌ర‌కూ మ‌ల‌యాళంలో అడుగు పెట్ట‌లేదు. కేవ‌లం క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ సినిమాలు చేసింది త‌ప్ప మాలీవుడ్ పై దృష్టి పెట్ట‌లేదు. మ‌రి ఎందుకు ఆ ర‌క‌మైన ప్ర‌య‌త్నం చేయ‌లేదు అన్న‌ది ఆమెకే తెలియాలి.

అమ్మ‌డు పుట్టి పెరిగింది చెన్నైలోనే. కానీ ప‌క్క‌నే ఉన్న కేర‌ళ వైపు ఎందుకు చూడ‌లేదు? అన్న‌ది ఆస‌క్తిక‌రం. అక్క‌డ సినిమాలంటే ఆస‌క్తి లేక‌నా? చిన్న ఇండ‌స్ట్రీ అనే కార‌ణంగా దూరంగా ఉందా? లేక ప్ర‌యత్నించినా అవ‌కాశాలు రాక లైట్ తీసుకుందా? అన్న‌ది తెలియాలి. అయితే చెన్నై భామ‌లు మాలీవుడ్ లో త‌క్కువ‌గా న‌టిస్తారు? అన్న‌ వాద‌న ఉంది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల‌కు ఇచ్చిన ప్రాధాన్య‌త చెన్నై సోయ‌గాలు మాలీవుడ్ కు ఇవ్వ‌ర‌ని అంటారు. కానీ ఇది చాలా పాత కాలం నాటి మాట‌. కొంత కాలంగా మాలీవుడ్ లోనూ ఎక్కువ‌గా సినిమాలు చేస్తున్నారు.

అక్క‌డ సినిమా బ‌డ్జెట్ కూడా భారీగా పెరిగింది. వంద‌ల కోట్ల రూపాయ‌ల చిత్రాల నిర్మాణం అక్క‌డా జ‌రుగుతోంది. ఇప్పుడా ప‌రిశ్ర‌మ‌ను చిన్న చూపు చూడాల్సిన ప‌నిలేదు. ఒక‌ప్పుడు కాన్సెప్ట్ బేస్ట్ చిత్రాలు ఎక్కువ‌గా రిలీజ్ అయ్యేవి. కానీ మాలీవుడ్ లో కూడా సినిమా స్టైల్ మార్చింది. క‌మ‌ర్శియ‌ల్ హంగులున్న క‌థ‌ల్ని సిద్దం చేస్తున్నారు. వంద‌ల కోట్ట వ‌సూళ్ల‌ను అక్క‌డ చిత్రాలు సాధిస్తున్నాయి. మాలీవుడ్ కంటెంట్ కు తెలుగు ఆడియ‌న్స్ బాగా క‌నెక్ట్ అవుతున్నారు. మ‌రి వీట‌న్నింటిని దృష్టిలో పెట్టుకుని రెజీనా ఇప్ప‌టికైనా మాలీవుడ్ ప్ర‌య‌త్నాలు చేస్తుందేమో చూడాలి.