ప్రెగ్నెంట్ అంటూ అబద్ధం.. రెజీనా కష్టం పగవాడికి కూడా వద్దురోయ్
అంతే ఆ సేల్స్ బాయ్ వెంటనే షాప్ ఓపెన్ చేసి నాకు ఆ స్వీట్ ఇచ్చాడు.. అలా నేను ఆ స్వీట్ కోసం అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది" అంటూ రెజీనా చెప్పుకొచ్చింది.
By: Madhu Reddy | 21 Oct 2025 12:00 AM ISTరెజీనా కసాండ్రా.. దక్షిణాది సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో తొలిసారి సుధీర్ బాబు హీరోగా వచ్చిన 'శివ మనసులో శృతి' అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. అతి తక్కువ సమయంలోనే పలువురు హీరోల సరసన నటించి భారీ పేరు దక్కించుకుంది. తెలుగు సినీ పరిశ్రమ అందించిన గుర్తింపుతో తమిళ్ చిత్రాలలో కూడా అవకాశాలు అందుకొని.. టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో మరింత ఇమేజ్ సొంతం చేసుకుంది..
ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. ఇటీవల హిందీలో జాట్, కేసరి చాప్టర్ 2, అటు తమిళ్ లో విదాముయార్చి వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం సినిమాలలోనే కాదు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్న ఈమె మరొకవైపు ఢీ వంటి డాన్స్ షోలలో కూడా జడ్జిగా వ్యవహరించి బుల్లితెర ఆడియన్స్ ను కూడా మెప్పించింది. అంతేకాదండోయ్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను అలరించే ఈమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ఇప్పుడు ఈమెను వార్తల్లో నిలిచేలా చేశాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. తనకు ఫుడ్ అంటే చాలా ఇష్టం అని చెప్పిన రెజీనా.. ఈ ఫుడ్డు కోసం తాను చేసిన పనికి సంబంధించిన ఒక షాకింగ్ అనుభవాన్ని అందరితో పంచుకుంది. అందులో భాగంగానే రెజీనా మాట్లాడుతూ.. "నాకు ఆహారం అంటే చాలా ఇష్టం. కానీ ఎప్పుడు ఎలా ఎంత తినాలో.. ఏం తినాలో కూడా జాగ్రత్త పడతాను. మంచి ఫుడ్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అలా ఒకరోజు బెంగళూరులో నాకు ఎంతో ఇష్టమైన మిష్టీ దోయ్ (బెంగాలీ స్వీట్) తినాలనిపించి, ఎన్నో స్వీట్ షాపుల్లో తిరిగాను. కానీ ఎక్కడ దొరకలేదు. అయితే చివరికి ఒక షాప్ లో కనిపించింది. కానీ అప్పటికే షాప్ క్లోజ్ చేసే సమయం అది. ఇక సేల్స్ బాయ్ ఇప్పుడే షాప్ క్లోజ్ అయింది.. సర్వ్ చేయలేం అని చెప్పాడు. నాకు ఏం చేయాలో తెలియలేదు. మిస్టీదోయ్ ఎలాగైనా సొంతం చేసుకోవాలనే కోరికతో.. నేను ప్రెగ్నెంట్.. నాకు స్వీట్ తినాలని చాలా కోరికగా ఉంది. దయచేసి ఇవ్వండి అని అబద్ధం చెప్పాను.
అంతే ఆ సేల్స్ బాయ్ వెంటనే షాప్ ఓపెన్ చేసి నాకు ఆ స్వీట్ ఇచ్చాడు.. అలా నేను ఆ స్వీట్ కోసం అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది" అంటూ రెజీనా చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ఒక స్వీట్ కోసం ప్రెగ్నెంట్ అంటూ అబద్ధం చెప్పి ఆ స్వీట్ ను దక్కించుకోవడంతో రెజీనాకి ఫుడ్ పై ఇష్టం ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
రెజీనా ప్రస్తుత చిత్రాల విషయానికి వస్తే.. సెక్షన్ 108, ఆంఖే 2 వంటి చిత్రాలలో నటిస్తోంది.సెక్షన్ 108 ఆంఖే 2, ది వైవ్స్ చిత్రాలు వచ్చే యేడాది విడుదల కాబోతున్నాయి. ఇటీవల ఈమె నటించిన ఫ్లాష్ బ్యాక్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
