Begin typing your search above and press return to search.

అల్ట్రా గ్లామ్ లుక్ తో గుబులు పుట్టిస్తున్న కుర్ర బ్యూటీ

పరిశ్రమలో ఎంతమంది పోటీదారులు ఉన్నా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన కెరీర్ రన్ ఉందని రెజీనా నిరూపిస్తోంది.

By:  Sivaji Kontham   |   5 July 2026 8:52 PM IST
అల్ట్రా గ్లామ్ లుక్ తో గుబులు పుట్టిస్తున్న కుర్ర బ్యూటీ
X

పెద్ద తెర, బుల్లితెర అనే తేడా లేకుండా నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ దూసుకుపోతోంది అందాల భామ రెజీనా కసాండ్రా. కెరీర్ ఆరంభంలో వెండితెరపై పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాలని ఎన్నో కలలు కన్న ఈ చెన్నై బ్యూటీ సినీ పరిశ్రమలో స్టార్‌డమ్ అనేది అందరికీ అంద‌ని ద్రాక్ష లాంటిదనే చేదు నిజాన్ని త్వరగానే గ్రహించింది. కేవలం ఒకే రంగానికి పరిమితం కాకుండా, వెండితెరపై అవకాశాలు తగ్గుతున్న క్రమంలో బుల్లితెరను, రియాలిటీ షోల జడ్జిగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను అల్లుకుపోవాలనే తెలివైన నిర్ణయంతో తన కెరీర్ జర్నీని వైవిధ్యంగా ముందుకు నడిపిస్తోంది.





పరిశ్రమలో ఎంతమంది పోటీదారులు ఉన్నా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన కెరీర్ రన్ ఉందని రెజీనా నిరూపిస్తోంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో డిజిటల్ విప్లవం (ఓటీటీ) వచ్చాక సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా నాయికలకు మంచి అవకాశాలు వస్తుండటం ఈ బ్యూటీకి బాగా కలిసి వచ్చింది. తెలుగు ప్రేక్షకులు రెజీనా నటనకు, చలాకీతనానికి ఎప్పుడో ఫిదా అవ్వగా... ఇప్పుడు బుల్లితెర రియాలిటీ షోల ద్వారా ఇక్కడి వీక్షకులకు మరింత దగ్గరైంది. నిరంతరం కొత్త ప్రయత్నాలతో దూసుకుపోతున్న రెజీనా శ్రమను, అంకితభావాన్ని క‌చ్చితంగా అభినందించాల్సిందే.





మరోవైపు.. రెజీనా సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్లతో కుర్రకారు గుండెల్లో నిరంతరం గుబులు పెంచుతోంది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన `బాడీ హగ్గింగ్` థై-స్లిట్ ఫ్రాక్ ఫోటోషూట్ ఇంటర్నెట్‌లో విపరీతమైన చర్చకు దారితీసింది. తన థై అందాలను ఎలివేట్ చేస్తూ, మతులు చెడగొట్టేలా ఇచ్చిన ఈ హాట్ పోజులపై అభిమానులు కాంప్లిమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఉన్న‌ ఈ విపరీతమైన క్రేజ్ కారణంగానే.. ఒక్కో ప్రమోషనల్ యాడ్ లేదా బ్రాండ్ పోస్ట్‌కు దాదాపు 3 లక్షల నుండి 5 లక్షల వరకు చార్జ్ చేస్తూ డిజిటల్ మార్కెట్లోనూ రాణిస్తోంది.





ఆదాయ వనరుల విషయానికి వస్తే... రెజీనా వెండితెరపై ఒక్కో సినిమాకు దాదాపు 60 లక్షల నుండి 80 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా బుల్లితెరపై సైతం తన హవా చూపిస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమయ్యే పాపులర్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నందుకు గాను.. ఒక్కో ఎపిసోడ్‌కు సుమారు 2 లక్షల నుండి 3 లక్షల వరకు పారితోషికం చెల్లిస్తున్నట్లు పరిశ్రమ వర్గాల టాక్. ఇలా మూడు ప్లాట్‌ఫామ్‌లను బ్యాలెన్స్ చేస్తూ ఆర్థికంగానూ రెజీనా గట్టి పునాది వేసుకుంటోంది.





న‌టిగా కెర‌ర్ విషయానికి వస్తే.. రెజీనా చివరగా తెలుగులో వచ్చిన `మరీచిక` చిత్రంలో నటించి మెప్పించింది. ప్రస్తుతం తన కెరీర్‌ను మరింత విస్తరిస్తూ తమిళం, హిందీ చిత్ర పరిశ్రమలలో పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. ఒకవైపు నటిగా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూనే... మరోవైపు ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్స్ సెట్ చేస్తూ గ్లామర్ క్వీన్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది.