Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : క్యూట్‌ బ్యూటీ డిఫరెంట్‌ ఔట్‌ ఫిట్‌ షో

రెజీనా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది.

By:  Ramesh Palla   |   26 Aug 2025 1:49 PM IST
పిక్‌టాక్‌ : క్యూట్‌ బ్యూటీ డిఫరెంట్‌ ఔట్‌ ఫిట్‌ షో
X

సుధీర్ బాబు హీరోగా నటించిన ఎస్‌ఎంఎస్‌(శివ మనసులో శృతి) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రెజీనా కాసాండ్రా. మొదటి సినిమా కమర్షియల్‌ బ్రేక్‌ ఇవ్వనప్పటికీ తెలుగులో మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకుంది. తన అందంతో పాటు, నటన ప్రతిభ కారణంగా తెలుగులో అదే ఏడాదిలో రొటీన్‌ లవ్‌ స్టోరీ ఆ తర్వాత కొత్త జంట, రారా కృష్ణయ్య, పవర్‌, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌, సౌఖ్యం, శౌర్యం ఇలా చాలా సినిమాల్లో నటించింది. మీడియం రేంజ్ సినిమాలకు ఒకానొక సమయంలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా చేసింది. అయితే ఇండస్ట్రీలో పది కాలాల పాటు నిలిచి పోవాలి అంటే స్టార్‌ హీరోల సినిమాల్లో నటించాల్సి ఉంటుంది. రెజీనాకు అలాంటి ఆఫర్లు దక్కక పోవడంతో ఎప్పుడూ ఆఫర్ల కోసం వెయిట్‌ చేయాల్సి వచ్చింది, దాంతో రెజీనా స్టార్‌ హీరోయిన్స్‌ జాబితాలో చోటు దక్కించుకోలేక పోయింది.


మెగా హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌

హీరోయిన్‌గా రెజీనా చేసిన సినిమాలు తక్కువేం కాదని చెప్పాలి. ఒకానొక సమయంలో మెగా హీరోల్లో టైర్‌ 2 హీరోలకు ఈమె మోస్ట్‌ వాంటెడ్‌గా నిలిచింది. రకరకాలుగా ఆసమయంలో పుకార్లు సైతం వచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు రెజీనా పూర్తిగా తమిళ్‌, హిందీ సినిమాలకు పరిమితం అయింది. తెలుగులో ఈమె చివరగా ఉత్సవం అనే సినిమాలో కనిపించింది. ఆ సినిమా పెద్దాగా ఆడక పోవడంతో కమర్షియల్‌ బ్రేక్‌ కోసం ఎదురు చూస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. అవి మీడియం రేంజ్‌ చిత్రాలే అయినప్పటికీ ఖచ్చితంగా తమిళ్‌, హిందీ భాషల్లో ఆ సినిమాల వల్ల రెజీనా ముందు ముందు మినిమం సినిమాలను దక్కించుకుంటుంది అనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.


ఇన్‌స్టాగ్రామ్‌లో రెజీనా జోరు

రెజీనా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. దాదాపుగా 25 లక్షల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న రెజీనా రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా తన ఫాలోవర్స్‌కి వినోదాన్ని పంచుతూ ఉంటుంది. తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేయడం ద్వారా రెజీనా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఈ డిఫరెంట్‌ ఔట్‌ ఫిట్‌ను ట్రై చేసి ఫోటోలకు ఫోజ్‌లు ఇవ్వడం ద్వారా అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్‌ రెజీనా సొంతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేస్తూ ఇలా అందం ఏమాత్రం తగ్గకుండా కాపాడుకుంటూ ఉంది. అందుకే ఎలాంటి ఔట్‌ ఫిట్‌ లో అయినా రెజీనా చూపు తిప్పనివ్వడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.


మినీ గౌనులో రెజీనా అందం

బ్లాక్ మినీ గౌన్ ధరించిన రెజీనా విభిన్నమైన షూ లతో ర్యాంప్‌ వాక్ చేస్తున్నట్లుగా రెజీనా ఇచ్చిన ఈ ఫోజ్‌ చూపు తిప్పనివ్వడం లేదు. పెద్దగా మేకప్ లేకుండా, సింపుల్‌ గ్రే షేడ్‌ మేకోవర్‌తో, డీసెంట్ హెయిర్‌ స్టైల్‌తో రెజీనా ఈ ఫోటోలో చాలా అందంగా ఉందని, ఎంత సేపు చూసినా చూడాలని ఉందని కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్‌ నేపథ్యంలో ఇలాంటి ఫోటోలు చూసిన చాలా మంది నెటిజన్స్‌ పాపం రెజీనాకు అందంకు తగ్గట్లుగా ఆఫర్లు దక్కలేదు, ఇంతకు ముందే స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు రావాల్సి ఉంది. ఇప్పటికి అయినా రెజీనా అందంను, ప్రతిభను ఇండస్ట్రీ వర్గాల వారు, ఫిల్మ్‌ మేకర్స్ గుర్తించాల్సిన అవసరం ఉందని చాలా మంది నెటిజన్స్‌, రెజీనా అభిమానులు కామెంట్స్ చేస్తూ, ఈ ఫోటోలను తెగ లైక్ చేస్తూ షేర్‌ చేస్తున్నారు.