రెజీనా చెబుతున్న లవ్ థియేరీ!
రెజీనా కసాండ్రా.. స్టార్ హీరోయిన్ అయ్యే గ్లామర్‌తో పాటు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నా ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌ల జాబితాలో చేరలేకపోయింది.
By: Ravindar Gorantla | 18 April 2026 8:00 PM ISTరెజీనా కసాండ్రా.. స్టార్ హీరోయిన్ అయ్యే గ్లామర్‌తో పాటు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నా ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌ల జాబితాలో చేరలేకపోయింది. తమిళ మూవీతో కెరీర్ ప్రారంభించినా తెలుగులో మాత్రం సుధీర్ బాబు హీరోగా అరంగేట్రం చేసిన `శివ మనసులో శృతి (ఎస్ ఎం ఎస్)` మూవీతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది. తొలిమూవీ ఆశించిన స్థాయి ఫలితాన్ని అందించలేకపోయినా వెంటనే సెకండ్ ఛాన్స్‌ని దక్కించుకుని `రొటీన్ లవ్‌స్టోరీ`తో సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకుంది.
ఆ తరువాత కొత్త జంట, రారా కృష్ణయ్య, పవర్, పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలతో వరుసగా సక్సెస్‌లని సొంతం చేసుకుని ఇండస్ట్రీలో నిలబడే ప్రయత్నం చేసింది. జ్యో అచ్యుతానంద వరకు బాగానే సాగిన రెజీనా ప్రయాణం తెగులో గాడి తప్పింది. అడివి శేష్‌తో `ఎవరు` వంటి హిట్ ఫిల్మ్ చేసినా రెజీనాకు క్రెడిట్ దక్కలేదు. ఆ సక్సెస్ అడివి శేష్ కు వెళ్లిపోయింది. ఆ తరువాత చేసిన సినిమాలేవీ పెద్దగా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ వస్తోంది.
ప్రస్తుతం తమిళ్లో ఫ్లాష్ బ్యాక్, నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న `ముకుతి అమ్మన్ 2` వంటి చిత్రాల్లో నటిస్తున్న రెడీనా హిందీలో మాత్రం ది వైవ్స్, సెక్షన్ 108 చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రెడీనా చేతిలో లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే తాజాగా ఓ పోడ్ కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజీనా ఫస్ట్ టైమ్ లవ్ థియరీ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ప్రేమ గురించి రెజీనా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వైరల్‌గా మారాయి.
ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఎవరూ ఆపలేరు. అయితే చాలా మంది ప్రేమను ఒక బలహీనతగా భావిస్తారు. కానీ నా దృష్టిలో ప్రేమ అనేది ప్రశాంతతతో కూడిన ఒక గొప్ప బలం. మనం ప్రతి రోజు చిరునవ్వుతో పాజిటివ్‌గా ఉండటానికి ప్రేమ ఒక శక్తినిచ్చే సాధినం. నేను కూడా ఒక రోజు ప్రేమకు పూర్తిగా సరెండర్ అయ్యాను` అని షాకింగ్ విషయాన్ని తెలిపింది రెజీనా. అంతే కాకుండా ప్రేమ విలువ గురించి చెబుతూ.. మనం ప్రేమను పంచడానికి, పొందడానికి అర్హులమనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు.
ప్రేమని ఎప్పుడూ తక్కువగా చూడకండి. అసలు మనం ప్రేమలో ఉన్నప్పుడు పొందే ఆనందం వెనకున్న అసలు కారణం ఏంటో తెలుసా? ఆప్రేమను కోల్పోతే కలిగే బాధ ఏంటో మనకు ముందు తెలియడమే. ఆ పెయినే మనకు ప్రేమ విలువని నిత్యం గుర్తు చేస్తూ ఉంటుంది` అంటూ లవ్ థియరీ చెప్పి షాక్ ఇచ్చింది రెజీనా. తను చెప్పిన లవ్ థియరీ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఉన్నట్టుండి రెజీనా లవ్ గురించి ఇంత డీప్‌గా లెక్చర్ ఇవ్వడం ఏంటని అంతా వాపోతున్నారు.
