చీరకట్టులో కవ్విస్తోన్న రెజీనా.. ఎంత అందంగా ఉందో!
రెజీనా కసాండ్రా షేర్ చేసిన ఈ చీర ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
By: Madhu Reddy | 18 Sept 2025 8:30 AM ISTరెజీనా కసాండ్రా.. 1988 డిసెంబర్ 13న తమిళనాడు చెన్నైలో జన్మించిన ఈమె.. మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది.. అలా మోడలింగ్ చేస్తున్న సమయంలోనే దర్శక నిర్మాతల కంట్లో పడ్డ ఈమె 2012లో 'శివ మనసులో శృతి' అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా వచ్చిన ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచినందుకుగానూ ఉత్తమ ఫిమేల్ తొలి పరిచయం విభాగంలో సైమా అవార్డును కూడా అందుకుంది.
తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, పిల్ల నువ్వు లేని జీవితం, పవర్, రారా కృష్ణయ్య , సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అంటూ పలు చిత్రాలలో నటించింది. 2012లో తెలుగు తెరకు పరిచయమైనా.. 2005లోనే ఈమె సినీ రంగ ప్రవేశం జరిగిపోయింది. అలా 2005లో తమిళంలో వచ్చిన 'కందనాళ్ ముదల్' అనే సినిమా ద్వారా నటిగా ఇండస్ట్రీకి పరిచయమై.. అటు తమిళ్ ఇటు తెలుగు చిత్రాలలో నటించింది. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా.. వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. ఇప్పటికీ వరుస ప్రాజెక్టులతో మరింత బిజీగా మారిపోయింది.
ఒకవైపు సినిమాలు.. మరొకవైపు వెబ్ సిరీస్ లు అంటూ ప్రేక్షకులను అలరిస్తున్న రెజీనా చివరిగా 'కేసరి చాప్టర్ 2' అనే హిందీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం 5 తమిళ్ ప్రాజెక్టులలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అలా నయనతార లీడ్రోల్ పోషిస్తూ వస్తున్న 'మూకుత్తి అమ్మన్ 2' సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దీనిని తెలుగులో అమ్మోరు తల్లి 2 గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాతో పాటు ఫ్లాష్ బ్యాక్, బోర్డర్, పార్టీ, కల్లా పార్ట్ వంటి చిత్రాలలో కూడా నటిస్తోంది. అలాగే మారీచికా అనే మలయాళం సినిమాతో పాటు సెక్షన్ 108 అనే హిందీ చిత్రంలో కూడా నటిస్తోంది.
అంతేకాదు ప్రస్తుతం తెలుగులో బుల్లితెరపై ఢీ వంటి షోలలో కూడా నటిస్తూ సందడి చేస్తోంది రెజీనా కసాండ్రా. అభిమానులను అలరించడానికి ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాను ఫాలో అవుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా చీరకట్టులో కనిపించి అభిమానులను అబ్బురపరిచింది. ముత్యాలతో చాలా అందంగా డిజైన్ చేసిన చీర ధరించి తన అందంతో అభిమానులను సైతం ఆకట్టుకుంది.
రెజీనా కసాండ్రా షేర్ చేసిన ఈ చీర ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు ఇక రెజీనా వ్యక్తిగత విషయానికి వస్తే.. 37 సంవత్సరాల వయసు వచ్చిన ఇంకా వివాహం చేసుకోకపోవడంతో అభిమానులు పెళ్లెప్పుడు చేసుకుంటారు అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు పెళ్లి ప్రకటన చేస్తుందో చూడాలి.
