Begin typing your search above and press return to search.

జీవితంలో మర్చిపోలేని సందర్భం.. స్పెషల్ పోస్ట్ పంచుకున్న రెబా!

ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందో, ఆమె అంతలా ఎందుకు మురిసిపోతుందో ఇప్పుడు చూద్దాం..

By:  Madhu Reddy   |   16 Feb 2026 11:36 AM IST
జీవితంలో మర్చిపోలేని సందర్భం.. స్పెషల్ పోస్ట్ పంచుకున్న రెబా!
X

నటి రెబా మోనికా జాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చూడగానే కళ్ళకు హాయినిచ్చే అందం, అంతకుమించిన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ మలయాళ ముద్దుగుమ్మ, తాజాగా ఇన్స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక స్పెషల్ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ప్రేమ అన్నది కేవలం ఒక రోజుకు పరిమితం కాదు, కానీ వాలెంటైన్స్ డే రోజు ఆ ప్రేమను పంచుకునే విధానం ఎప్పటికీ గుర్తిండిపోతుంది. తన జీవితంలో మర్చిపోలేని ఒక అద్భుతమైన సందర్భాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందో, ఆమె అంతలా ఎందుకు మురిసిపోతుందో ఇప్పుడు చూద్దాం..




అపురూపమైన జ్ఞాపకం:

నటి రెబా మోనికా జాన్ తన భర్త జోమోన్ జోసెఫ్‌తో కలిసి ఉన్న క్యూట్ అండ్ రొమాంటిక్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా జోమోన్ ఆమెకు ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఫోటోలలో ఈ జంట ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ, ఫ్లవర్స్ తో, అలాగే గ్రీటింగ్ కార్డు తో, పార్టీ మూడ్‌ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. రెబా తన పోస్ట్‌లో జీవితంలో మర్చిపోలేని సందర్భం అంటూ భర్తపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు "మేడ్ ఫర్ ఈచ్ అదర్" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. బ్లూ డ్రెస్సులో రెబా మెరిసిపోతుంటే, సూట్ లో జోమోన్ ఆమె పక్కన చాలా కూల్‌గా కనిపిస్తున్నారు.




ప్రేమ ప్రయాణం:

సినిమాల్లో లవర్ బాయ్స్ పక్కన అందంగా కనిపించే రెబా, నిజ జీవితంలో తన జోడీని ఎంచుకోవడంలో కూడా తన అభిరుచిని చాటుకున్నారు. జోమోన్ జోసెఫ్‌తో తన వివాహం జరిగినప్పటి నుండి, రెబా తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటూనే ఉన్నారు. ఇక ఈ వాలెంటైన్ వేడుకల్లో భాగంగా కేవలం రొమాంటిక్ డిన్నర్ మాత్రమే కాకుండా, ఒక సరదా పార్టీని కూడా వారు ఎంజాయ్ చేశారు. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ చూస్తుంటే, ప్రేమలో ఉన్న మ్యాజిక్ ఏంటో స్పష్టంగా కనిపిస్తోంది. తన జీవితంలో ప్రతి చిన్న సంతోషానికి తన భర్త జోమోన్ కారణమని రెబా ఈ స్పెషల్ పోస్ట్ ద్వారా మరోసారి నిరూపించారు.




సాధారణంగా సెలబ్రిటీల లైఫ్ అంటే చాలా బిజీగా ఉంటుంది, కానీ రెబా తన ప్రొఫెషనల్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నారు. తన భర్తతో ఉన్న మధుర జ్ఞాపకాలను ఇలా సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా తన ఫాలోవర్లలో కూడా పాజిటివిటీని నింపుతున్నారు. ఇక ఈ వాలెంటైన్స్ డే ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ జంట ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ, సంతోషంగా ఉండాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. రెబా మోనికా జాన్ పంచుకున్న ఈ మర్చిపోలేని సందర్భం ఆమె ఫ్యాన్స్ కు ఒక మంచి ట్రీట్ అని చెప్పాలి.