Begin typing your search above and press return to search.

బేబీ బంప్ తో దర్శనమిచ్చిన రెబా మోనిక జాన్.. ఆ క్షణం కోసం మొదలైన కంగారు!

రెబా మోనిక జాన్.. శ్రీ విష్ణు హీరోగా నటించిన సామజవరగమణ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.

By:  Madhu Reddy   |   21 Jun 2026 1:24 PM IST
బేబీ బంప్ తో దర్శనమిచ్చిన రెబా మోనిక జాన్.. ఆ క్షణం కోసం మొదలైన కంగారు!
X

రెబా మోనిక జాన్.. శ్రీ విష్ణు హీరోగా నటించిన సామజవరగమణ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులో పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రెబా మోనిక జాన్ త్వరలో తల్లి కాబోతున్నారు. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ చివరి వారాల్లో ఉన్న ఈమె తాజాగా తన లేటెస్ట్ బేబీ బంప్ ఫోటోషూట్ ను అభిమానులతో పంచుకుంటూనే.. ఆ క్షణం కోసం కంగారు మొదలయ్యింది అంటూ తన అభిప్రాయాలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.




త్వరలో తల్లి కాబోతున్న శ్రీ విష్ణు హీరోయిన్..

ఇదిలా ఉండగా గత రెండు వారాల క్రితం తన భర్తతో కలిసి థాయిలాండ్ కి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడి ప్రాంతాలలో తిరుగుతూ కడుపులో బిడ్డను మోస్తూ పక్కలో భర్తతో ఎంజాయ్ చేస్తూ తన సమయాన్ని ఆనందంగా గడిపిన ఈమె.. తన భర్తతో కలిసి డాన్స్ చేసిన వీడియోలను అభిమానులతో పంచుకుంది. మా చిన్నారి రాకకు ముందు చివరి కొన్ని వారాలు.. మా రోజులు ఇలా సాగుతున్నాయి" అంటూ తన భర్తతో డాన్స్ చేసిన వీడియోని అభిమానులతో ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. అందరూ ఈ టైంలో మీరు ఇంకా మీ హాస్పిటల్ బ్యాగ్ సర్దుకోలేదా అని అడుగుతున్నారు.. మేము మాత్రం ఇలా అంటూ క్యాప్షన్ జోడించింది. ఇక ఇందులో ఆమె తన భర్త జోమోన్ జోసెఫ్ తో కలిసి స్టెప్పులేస్తూ కనిపించింది. ఆ వీడియోలలో ఎంతో సంతోషంగా, హుందాగా, ఎలాంటి కంగారు, ఆందోళన లేకుండా ఇద్దరూ హ్యాపీగా డాన్స్ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు.




కంగారు మొదలైంది అంటూ బేబీ బంప్ ఫోటోషూట్ షేర్..

అయితే ఇప్పుడు రోజులు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ కంగారు తనలో స్పష్టంగా కనిపిస్తోంది అంటూ చెప్పుకొచ్చింది రెబా మోనిక. ఈ మేరకు వన్ పీస్ షోల్డర్ లెస్ టాప్ ధరించిన ఈమె.. ఈ బిగుతైన దుస్తులలో తన బేబీ బంప్ ను చాలా స్పష్టంగా కనిపించేలా ఫోటోలు పంచుకుంది. ఇక ఈ ఫోటోలలో కాస్త ఆనందంగా కనిపించినా.. ఈమె జోడించిన క్యాప్షన్ మాత్రం ఈమె తన మనసులో కంగారు పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ.." ఆ రోజు రావడానికి ఇంకా కొన్ని రోజులే.. నేను కంగారుగా ఉన్నానా? అవును !.. కానీ ఈ ప్రయాణంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నానా? అంటే కచ్చితంగా అవుననే చెబుతాను" అంటూ ఒక హార్ట్ ఎమోజిని పంచుకుంది.




సాధారణంగా గర్భిణీ స్త్రీలు ప్రసవం రోజులు దగ్గరపడే కొద్దీ ప్రతి ఒక్కరిలో ఆ కంగారు మొదలవడం సహజమే. ఇక అందరిలాగే తనలో కూడా ఆ కంగారు మొదలైంది అంటూ రెబా మోనిక జాన్ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం రెబా మోనిక జాన్ లేటెస్ట్ బేబీ పంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.