Begin typing your search above and press return to search.

ఆ జంట‌లా ఈ జంట 8 ఏళ్ల ప్రేమ‌క‌థ‌

ఇప్పటివ‌ర‌కూ గ్లామ‌ర్ రంగంలో అత్యంత ఆద‌ర్శ‌వంత‌మైన ప్రేమ వివాహం ఏదైనా ఉందా? అంటే.. అది క‌చ్ఛితంగా వ‌రుణ్ ధావ‌న్- న‌టాషా ద‌లాల్ ప్రేమపెళ్లి.

By:  Sivaji Kontham   |   10 Jan 2026 9:00 AM IST
ఆ జంట‌లా ఈ జంట 8 ఏళ్ల ప్రేమ‌క‌థ‌
X

ఇప్పటివ‌ర‌కూ గ్లామ‌ర్ రంగంలో అత్యంత ఆద‌ర్శ‌వంత‌మైన ప్రేమ వివాహం ఏదైనా ఉందా? అంటే.. అది క‌చ్ఛితంగా వ‌రుణ్ ధావ‌న్- న‌టాషా ద‌లాల్ ప్రేమపెళ్లి. ఈ జంట చిన్న‌ప్ప‌టి నుంచి స్నేహితులు. పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ధావ‌న్ సినీరంగానికి చెందినవాడు అయితే ద‌లాల్ పూర్తిగా ఈ రంగంతో సంబంధం లేని యువ‌తి. జువెల‌రీ రంగంలో ద‌లాల్ సుప్ర‌సిద్ధులు. కానీ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ప్రేమ ఎంతో గొప్ప‌గా నిల‌బ‌డింది.




ఆస‌క్తిక‌రంగా ఈ జంట 8 ఏళ్లుగా ఒకరికొకరు తెలిసిన వారు. 4 ఏళ్లుగా వివాహ బంధంలో ఉన్నారు. గ్లామ‌ర్ రంగంలో చాలా మంది హీరోల మాదిరిగా వ‌రుణ్‌ త‌న గాళ్ ఫ్రెండ్ ని మార్చేయ‌లేదు. త‌న ప్రేమ‌కు క‌ట్టుబ‌డి న‌టాషా ద‌లాల్ ని పెళ్లాడాడు. అత‌డు తన పోస్ట్‌లో నటాషాను తన చీర్‌లీడర్, బెస్ట్ ఫ్రెండ్, లవర్ అని అభివర్ణిస్తూ..నువ్వు ఎప్పటికీ నా బేబీవే! అంటూ ప్రేమను చాటుకున్నారు. వీరిద్దరూ స్కూల్ రోజుల నుండే స్నేహితులు. చాలా కాలం డేటింగ్ చేసిన తర్వాత అలీబాగ్‌-ముంబైలో సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. 2024లో ఈ జంటకు ఒక ఆడపిల్ల (లారా) జన్మించింది. తల్లిదండ్రులుగా మారిన తర్వాత మొదటి వెడ్డింగ్ యానివర్సరీ కూడా అయింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి గారి కుమార్తె సుస్మిత కొణిదెల కూడా ఈ పోస్ట్‌పై స్పందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.




ఇప్పుడు ఈ క‌థంతా గుర్తు చేసుకోవ‌డానికి ఒక కార‌ణం ఉంది. ఇంచుమించు 8ఏళ్లు ప్రేమ‌లో ఉండి, 4 ఏళ్ల క్రితం పెళ్లాడిన మ‌రో జంట దీనికి కార‌ణం. న‌టి రెబా మోనిక‌, త‌న స్నేహితుడిని నాలుగేళ్ల క్రితం పెళ్లాడారు. నేడు నాలుగో వార్షికోత్స‌వం. ఈ సంద‌ర్భంగా ఒక ఎమోష‌న‌ల్ నోట్ ని షేర్ చేయగా అది వ‌రుణ్ - న‌టాషా నాటి ఎమోష‌న‌ల్ నోట్ ని గుర్తు చేసింది.




``నీవు తెలిసి ఎనిమిది సంవత్సరాలు, నీతో పెళ్లై నాలుగు సంవత్సరాలు. నాకు ప్రోత్సాహాన్నిచ్చేదానివి.. నా ప్రాణ స్నేహితురాలివి, నా ప్రేయసి, వీటన్నింటికీ మించి అన్నీ నువ్వే. నేను ప్రార్థించి ఆశించేదంతా నువ్వే. నా ప్రియతమా.. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నువ్వు ఎప్పటికీ నా బేబీవే!..`` అంటూ భ‌ర్త జోమ‌న్ జోసెఫ్ ఎమోష‌న‌ల్ నోట్ రాసాడు.

నటి రెబా మోనికా జాన్ - జోమన్ జోసెఫ్ 9 జనవరి 2022న బెంగళూరులోని ఒక చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. జోమన్ తన పుట్టినరోజు సందర్భంగా దుబాయ్‌లో రెబాకు ప్రపోజ్ చేశారు. చాలా కాలం డేటింగ్ చేసిన తర్వాత వీరు పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు.

జోమన్ జోసెఫ్ వృత్తిరీత్యా ఒక బిజినెస్ కన్సల్టెంట్. అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి, ప్రస్తుతం ఒక మల్టీనేషనల్ కంపెనీ (MNC)లో పనిచేస్తున్నారు. బెంగళూరులో సొంత వ్యాపారాలు కూడా ఉన్నాయి. సినిమాలకు సంబంధం లేకపోయినా రెబా కెరీర్‌కు ఆయన పూర్తి మద్దతు ఇస్తుంటారు. జనవరి 9- పెళ్లి రోజును పుర‌స్క‌రించుకుని రెబా మోనికా జాన్ తన ఇన్‌స్టాలో భర్తతో కలిసి ఉన్న రొమాంటిక్ ఫోటోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం! అంటూ పోస్ట్ చేసారు.

`సామజవరగమన` సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న రెబా ఇటీవల `మ్యాడ్ స్క్వేర్` సినిమాలో స్వాతిరెడ్డి పాటతో హల్చల్ చేశారు. రజనీకాంత్ `కూలీ`లోను న‌టించింది. శ్రీ విష్ణు సరసన నటిస్తున్న `మృత్యుంజ‌య్`లోను న‌టించింది. ఈ సినిమా మార్చి 2026లో విడుదల కాబోతోంది.