Begin typing your search above and press return to search.

సుకుమార్ కు ఇంకా టైమ్ కావాలా?

టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొల్పుతున్న కాంబినేషన్ల‌లో రామ్ చ‌ర‌ణ్- సుకుమార్ జోడీ ఒక‌టి. వీరి కలయికలో గతంలో వచ్చిన రంగ‌స్థ‌లం బ్లాక్‌బస్టర్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   11 March 2026 12:20 PM IST
సుకుమార్ కు ఇంకా టైమ్ కావాలా?
X

టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొల్పుతున్న కాంబినేషన్ల‌లో రామ్ చ‌ర‌ణ్- సుకుమార్ జోడీ ఒక‌టి. వీరి కలయికలో గతంలో వచ్చిన రంగ‌స్థ‌లం బ్లాక్‌బస్టర్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ కలిసి పని చేస్తారని తెలిసినప్పటి నుంచి అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను RC17గా పిలుచుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

చ‌ర‌ణ్ కోసం రెండు క‌థ‌లు

ఇటీవల ఈ సినిమా గురించి పలు వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ ను ఇంకా ఫైనల్ చేయలేదన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కథపై ఆయన మరింత ఎక్కువ‌గా పని చేస్తున్నారని, అందులో భాగంగానే ఒక‌టికి రెండు క‌థ‌ల‌ను రెడీ చేశార‌ని అంటున్నారు. త్వరలోనే ఆ రెండు క‌థ‌ల‌ను రామ్ చరణ్‌కు వినిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ ఏ దిశగా వెళ్లబోతుందన్న ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.

RC17 ఫైన‌ల్ స్క్రిప్ట్ ఇంకా రెడీ కాలేదా?

అసలు ఈ చర్చలకు కారణం ఇటీవల వచ్చిన కొన్ని రూమర్లు. సుకుమార్ టీమ్‌లోని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినిమా స్క్రిప్ట్ గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో RC17 కథ ఏ స్థాయిలో ఉందన్న ప్రశ్నలు కూడా మొద‌ల‌య్యాయి. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పుష్ప‌2 తర్వాత సుకుమార్ త‌న త‌ర్వాతి సినిమాపై ఫోక‌స్ చేయ‌డానికి అత‌న‌కి ఎక్కువ టైమ్ దొరికింద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే ఈ ఏడాదిన్న‌ర టైమ్ కూడా సుకుమార్ కు స‌రిపోక‌పోవ‌డం వ‌ల్లే ఆర్సీ17 ఫైన‌ల్ స్క్రిప్ట్ ఇంకా రెడీ అవ‌లేదా అనే డిస్క‌ష‌న్స్ కూడా మొద‌ల‌య్యాయి.

చ‌ర‌ణ్ బ‌ర్త్ డే నాడు అనౌన్స్‌మెంట్?

అయితే ఇప్పుడు చ‌ర‌ణ్ ఫ్యాన్స్ క‌ళ్ల‌న్నీ మార్చి 27 పైనే ఉన్నాయి. మార్చి 27న చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమా గురించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని అంద‌రూ దాని కోసం వెయిట్ చేస్తున్నారు. సాధార‌ణంగా టాలీవుడ్ లో స్టార్ హీరోల బ‌ర్త్ డే సంద‌ర్భంగా వారి నెక్ట్స్ ప్రాజెక్టుల‌ను అనౌన్స్ చేసే సంప్ర‌దాయం ఇండ‌స్ట్రీలో ఉంది. ఈ నేప‌థ్యంలోనే RC17పై ఆ రోజున అప్డేట్ వ‌చ్చే అవ‌కాశ‌ముంటుంద‌ని ఆశ ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌, బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో పెద్ది అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ సినిమా ప‌నులతో బిజీగా ఉన్న చ‌ర‌ణ్‌, అది పూర్తైన వెంట‌నే సుకుమార్ సినిమాను చేయ‌నున్నారు. అయితే RC17 అనౌన్స్‌మెంట్ గురించి ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.