Begin typing your search above and press return to search.

'ఆర్సీ 17' ధురంధ‌ర్ లా ప్లాన్ చేస్తున్నారా?

సాధారణంగా పార్ట్ 1 హిట్టయిన తర్వాత పార్ట్ 2 కోసం ఏళ్ల తరబడి వేచి చూడటం రెగ్యులర్‌గా జ‌రుగుతున్న‌దే.

By:  Srikanth Kontham   |   28 Jun 2026 5:00 PM IST
ఆర్సీ 17 ధురంధ‌ర్ లా ప్లాన్ చేస్తున్నారా?
X

`రంగస్థలం` వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా `ఆర్సీ 17` ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క‌ల‌యిక‌లో అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందనే అంచనాలు అభిమానుల్లో ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా `ఆర్సీ 17` కి సంబం ధించిన మైండ్ బ్లోయింగ్ ప్లాన్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. సుకుమార్ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట. ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది.

సాధారణంగా పార్ట్ 1 హిట్టయిన తర్వాత పార్ట్ 2 కోసం ఏళ్ల తరబడి వేచి చూడటం రెగ్యులర్‌గా జ‌రుగుతున్న‌దే. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం రీసెంట్‌గా ట్రెండ్ సెట్ చేసిన `ధురంధర్` సినిమా తరహాలోనే రెండు భాగాలను తక్కువ వ్యవధిలోనే విడుదల చేయాలని సుకుమార్ పక్కా స్కెచ్ వేస్తున్నారట. సుకుమార్ గ‌తంలో పార్ట్ 1 - పార్ట్ 2 ల మధ్య ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల ఎదురైన ప్రొడక్షన్ సవాళ్లు, బడ్జెట్ అంచనాలు పెరిగిపోవడం వంటి అనుభవాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఆర్సీ 17 విషయంలో ఆ తప్పు జరగకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.

రెండు భాగాల స్క్రిప్ట్‌ను ఒకేసారి పక్కాగా లాక్ చేసి వీలైనంత వరకు షూటింగ్‌ను కూడా పారలల్‌గా కంప్లీట్ చేయాలనేది ప్లాన్ గా వినిపిస్తోంది. దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ తగ్గడమే కాకుండా నటీనటుల డేట్లు కూడా సర్దుబాటు అవుతాయి. ప్రేక్షకులకు కూడా ఈ విధమైన షార్ట్-గ్యాప్ రిలీజ్ స్ట్రాటజీ సరికొత్త థ్రిల్‌ను ఇస్తుంది. పార్ట్ 1 చూసిన తర్వాత కథలోని సస్పెన్స్, క్యూరియాసిటీ బలంగా ఉన్నప్పుడే.. కొన్ని నెలల వ్యవధిలోనే పార్ట్ 2 థియేటర్లలోకి వస్తే ఆ ఇంపాక్ట్ - బాక్సాఫీస్ వసూళ్లు అసాధారణంగా ఉంటాయి. `ధురంధర్` చిత్రం ఇదే ఫార్ములాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. తాజాగా రామ్ చరణ్ ఇమేజ్‌కు ఈ విధమైన వినూత్న ప్లాన్ తోడైతే సౌత్ పాన్-ఇండియా మార్కెట్ షేక్ అవ్వడం ఖాయం. ప్రస్తుతం ఈ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జ‌రుగుతున్నాయి. రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌లే `పెద్ది` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా పాన్ ఇండియాలో భారీ విజ‌యం అందించింది. దీంతో చ‌ర‌ణ్ రెట్టించిన ఉత్సాహంతో కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటారు.