Begin typing your search above and press return to search.

RC17 : సుకుమార్‌ ప్లానింగ్‌ ఏంటో?

రామ్‌ చరణ్‌ తో ఇంతకు ముందు విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రంగస్థలం సినిమాను తీసిన సుకుమార్‌ ఇప్పుడు ఏం ప్లాన్‌ చేస్తున్నాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

By:  Ramesh Palla   |   14 July 2026 1:00 AM IST
RC17 : సుకుమార్‌ ప్లానింగ్‌ ఏంటో?
X

మెగా ఫ్యాన్స్‌తో పాటు, తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పెద్ది సినిమా గత నెల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేట్రికల్‌ రన్‌లో మంచి వసూళ్లు సాధించిన పెద్ది సినిమా ఓటీటీలోనూ దుమ్ము రేపుతోంది. జాన్వీ కపూర్‌ పాత్ర విషయమై విమర్శలు ఎదురు అయిన నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. పెద్ది సినిమా గొప్ప ఇన్సిపిరేషనల్‌ స్టోరీ అంటూ రివ్యూలు వచ్చాయి. రామ్‌ చరణ్ యాక్టింగ్‌తో పాటు, కథ, కథనంపైనా పలువురు ప్రశంసలు కురిపించారు. పెద్ది హడావిడి తగ్గింది. ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌ కావడంతో ఇప్పుడు అంతా కూడా రామ్‌ చరణ్ తదుపరి సినిమా విషయమై చర్చలు మొదలు అయ్యాయి. ఇప్పటికే రామ్‌ చరణ్ తదుపరి సినిమా సుకుమార్‌ దర్శకత్వంలో అని, అది RC17 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

పుష్ప 2 సినిమా తర్వాత సుకుమార్‌...

సుకుమార్ గత చిత్రాలు పుష్ప, పుష్ప 2 భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అందుకే రామ్‌ చరణ్‌ తో ఆయన రూపొందించబోతున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప 2 సినిమా వసూళ్లు రికార్డ్‌ బ్రేక్‌ చేసిన విషయం తెల్సిందే. అందుకే రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబోలో సినిమా సైతం అంతకు మించి అన్నట్లుగా ఉండబోతుందని అభిమానులు అన్ని వర్గాల వారు చాలా నమ్మకంగా ఉన్నారు. సుకుమార్‌ ప్రతి సీన్‌ను, పాత్రను చాలా జాగ్రత్తగా రాసుకోవడం మనం చూస్తూ ఉంటాం. రామ్‌ చరణ్‌ తో ఇంతకు ముందే రంగస్థలం సినిమాను తీసిన సుకుమార్‌ ఇప్పుడు మరో హిట్‌ కొట్టడం ఖాయం అని అభిమానులు ధీమాతో ఉన్నారు. ఇటీవలే సినిమాను ప్రకటించిన సుకుమార్‌ షూటింగ్‌ ఎప్పుడు మొదలు పెడతాడు అంటూ ఆయన అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.

రామ్‌ చరణ్‌ రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్‌తో..

పుష్ప 2 తర్వాత చాలా పెద్ద గ్యాప్‌ తీసుకున్న సుకుమార్‌ అతి త్వరలోనే రామ్‌ చరణ్‌ సినిమా వర్క్‌ షురూ చేయబోతున్నాడని ఆయన శిష్యులు చెబుతున్నారు. ఇప్పటికే స్టోరీ లైన్ సిద్ధంగా ఉంది. డైలాగ్‌ వర్షన్‌ స్క్రిప్ట్‌ పై వర్క్‌ జరుగుతున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రామ్‌ చరణ్ పెద్ది సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఆ సమయంలోనే చరణ్‌కు గాయాలు అయ్యాయి. దాంతో చరణ్ సర్జరీ సైతం చేయించుకోవాల్సి వచ్చింది. రామ్‌ చరణ్‌ దాదాపు మూడు నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకున్న తర్వాత మాత్రమే సుకుమార్‌ సినిమా కోసం రెడీ అవుతాడని మెగా కాంపౌండ్ నుండి సమాచారం అందుతోంది. అంటే సెప్టెంబర్‌ వరకు రామ్‌ చరణ్ పూర్తిగా విశ్రాంతి మూడ్‌లో ఉంటాడని తెలుస్తోంది. సుకుమార్‌ సైతం ఈ గ్యాప్‌లో స్క్రిప్ట్‌ వర్క్ మెల్లగా చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబో మూవీ...

రామ్‌ చరణ్‌ తో ఇంతకు ముందు విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రంగస్థలం సినిమాను తీసిన సుకుమార్‌ ఇప్పుడు ఏం ప్లాన్‌ చేస్తున్నాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప సినిమా సైతం విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ కావడంతో రామ్‌ చరణ్‌ తో తీయబోతున్న సినిమా సైతం విలేజ్ బ్యాక్‌ డ్రాప్‌ అయ్యే అవకాశం ఉందని, అంతే కాకుండా పీరియాడిక్‌ నేపథ్యం కూడా అయితే బాగుంటుందని, సుకుమార్‌కి అది కలిసి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబో మూవీ పై అంచనాలు మొదలు కాకుండానే పెరిగి పోతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారు. హిట్‌ కాంబినేషన్‌ కావడంతో రికార్డ్‌ స్థాయిలో ప్రీ రిలీజ్‌ బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. 2027 ఆరంభంలోనే సినిమాను మొదలు పెట్టి, 2028 కి విడుదల చేసే విధంగా సుకుమార్‌ ప్లాన్‌ చేసినట్లు సమాచారం అందుతోంది.