కాంబినేషన్ విడిపోవడం విచారకరమే!
టాలీవుడ్ లో దశాబ్దాలుగా తిరుగులేని మ్యాజిక్ తో అద్భుతమైన కాంబినేషన్ డిపోవడం తాజాగా ఇండస్ట్రీలోఎ చర్చనీయాంశమైంది.
By: Srikanth Kontham | 2 Nov 2026 7:21 PM ISTటాలీవుడ్ లో దశాబ్దాలుగా తిరుగులేని మ్యాజిక్ తో అద్భుతమైన కాంబినేషన్ డిపోవడం తాజాగా ఇండస్ట్రీలోఎ చర్చనీయాంశమైంది. `ఆర్య` తో మొదలైన సుకుమార్- దేవిశ్రీ ప్రసాద్ ల ప్రయాణం టాలీవుడ్‌లో ఓ చరిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. ఇద్దరి కలయికలో తెరకెక్కిన ప్రతీ సినిమా మ్యూజికల్ ఆల్బమ్‌గా చరిత్ర సృష్టించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. అలాంటిది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న `RC 17` సినిమా విషయంలో ఈ కాంబో రిపీట్ కాకపోవడం అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
సుకుమార్ ప్రతి చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం ఇండస్ట్రీలో సెంటిమెంట్‌గా.. బలమైన బంధంగా మరిందన్నది కాదనలేని నిజం. నా పేరు సుకుమార్ కాదు.. సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ అని స్వయంగా సుకుమార్ వేదికలపై ప్రకటించారంటేఫ? వారి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో? అర్థం చేసుకోవచ్చు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే పాటలు.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని తారస్థాయికి తీసుకెళ్లేవి. అయితే సుకుమార్ కెరీర్‌లో తొలిసారిగా ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ `RC 17` కోసం డీఎస్పీని పక్కన పెడుతున్నారనే వార్తలు ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ భారీ ప్రాజెక్ట్ కోసం దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో సౌత్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ను రంగంలోకి దంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా `ఎల్లమ్మ` సినిమా పనుల్లో .. ఇతర ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉండటం వల్లే ఈ భారీ చిత్రానికి దూరమయ్యారనే వాదన వినిపిస్తోంది. కారణం ఏదైనా? సుకుమార్-దేవిశ్రీ కాంబినేషన్ విడిపోవడం మాత్రం అభిమానులకు జీర్ణించుకోలేని విషయమే. ఇద్దరి మధ్య ఉన్న క్రియేటివ్ సింక్ సినిమా ప్రేమికులకు ఎన్నో మ్యూజికల్ ట్రీట్‌లను అందించింది.
`రంగస్థలం` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా కావడంతో `RC 17`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం విశేషం. ఇంతటి క్రేజీ ప్రాజెక్ట్‌కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించకపోవడం.. అనిరుధ్ లాంటి మరో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ ఇస్తుండటం సినిమాపై అంచనాలను సరికొత్త మార్గంలోకి మళ్లిస్తోంది.
అనిరుధ్ ట్రెండీ మ్యూజిక్‌తో అన్ని ఇండస్ట్రీలను ఊపేస్తున్నా? సుకుమార్ సినిమాల్లో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చే నేటివిటీ అండ్ ఫోక్ బీట్స్ మ్యాజిక్ వేరుగా ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సుకుమార్ ఎమోషనల్ అండ్ రస్టిక్ కథలకు దేవిశ్రీ సంగీతం ప్రాణం పోస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో అనిరుధ్ ఆ స్థాయి మ్యాజిక్‌ను రిపీట్ చేయగలడా? లేదా? అనేది ఆసక్తికరం. ఏదేమైనా టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబో తాత్కాలికంగా విడిపోవడం మాత్రం సినీ ప్రియులకు విచారకరమైన వార్త.
