RAW NTR: ఆపేది లేదన్నారు.. చివరికి ఆ సేవలు కూడా ఆపేశారు!
జూనియర్ ఎన్టీఆర్ పేరుతో అభిమానులు ప్రారంభించిన 'రా ఎన్టీఆర్' (RAW NTR) తన సేవా కార్యక్రమాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసింది.
By: M Prashanth | 15 Aug 2026 9:08 AM ISTజూనియర్ ఎన్టీఆర్ పేరుతో అభిమానులు ప్రారంభించిన 'రా ఎన్టీఆర్' (RAW NTR) తన సేవా కార్యక్రమాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఆగస్టు 14న ఎన్టీఆర్ మీల్ సర్వీసులను పర్మనెంట్‌గా ఆపేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఏపీలోని 150కి పైగా కేంద్రాల్లో పంపిణీ చేసిన దాదాపు 2,000 మీల్ కిట్లను చెన్నైలోని తమ ఆఫీస్ అడ్రస్‌కు వెనక్కి పంపాలని అందులో కోరారు.
ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాలనే ఉద్దేశంతో మొదట ఈ ఎన్టీఆర్ మీల్ సర్వీస్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 'ఊరు వాడ' పేరుతో ఏపీ, తెలంగాణలో భారీ స్థాయి సేవా కార్యక్రమాలు మొదలుపెడతామని ప్రకటించారు. ఎన్నో సర్వీస్ ప్లాన్‌ను సంస్థ తెరపైకి తేవడంతో, ఇది ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ కోసం చేస్తున్న గ్రౌండ్‌వర్క్ అనే ప్రచారం మొదలై కాంట్రవర్సీకి దారితీసింది.
ఈ పొలిటికల్ చర్చ సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో జూలై 14న ఎన్టీఆర్ టీమ్ అఫీషియల్‌గా స్పందించింది. రా ఎన్టీఆర్ సంస్థకు, ఎన్టీఆర్‌కు లేదా ఆయన ఆఫీస్‌కు ఎలాంటి సంబంధం, ఆథరైజేషన్ లేదని క్లియర్ చేసింది. వాళ్లు చేస్తున్న కార్యక్రమాలతో తమకు అసలు సంబంధమే లేదని ప్రెస్ నోట్ ద్వారా పూర్తి డిస్టెన్స్ మెయింటైన్ చేసింది.
ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి క్లారిటీ వచ్చినప్పటికీ.. జూలై 18న రా ఎన్టీఆర్ ఫౌండర్ సాయి రూప్ తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టారు. తమది పొలిటికల్ ప్రోగ్రామ్ కాదని, కేవలం సోషల్ సర్వీస్ మాత్రమేనని అందులో చెప్పారు. హీరో స్వయంగా వచ్చి చెప్పేదాకా ఈ సేవా కార్యక్రమాలను ఆపే ప్రసక్తే లేదని ఆయన ఆరోజు గట్టిగా స్టాండ్ తీసుకున్నారు.
ప్రెస్ మీట్‌లో అంత గట్టిగా చెప్పిన కొద్ది రోజులకే ఊహించని పరిణామం ఎదురైంది. ఆ తరువాత సంస్థ తమ యాక్టివిటీస్‌ను పూర్తిగా షట్‌డౌన్ చేస్తున్నట్లు సడెన్‌గా ప్రకటించింది. ఇలా ఉన్నట్టుండి సేవలు నిలిపివేయడానికి వాళ్లు అధికారికంగా ఎలాంటి కారణం చెప్పలేదు. ప్రెస్ మీట్ పెట్టి సేవలు కొనసాగిస్తామని చెప్పిన కొద్ది రోజులకే ఈ ప్రకటన రావడం అప్పట్లో మరింత హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం ముగిసింది. ఎన్టీఆర్ మీల్ సర్వీసులను కూడా పర్మనెంట్‌గా డిస్కంటిన్యూ చేస్తున్నట్లు ఆ సంస్థ అఫీషియల్ గా ఒక నోట్ రిలీజ్ చేసింది. మీల్ సర్వీస్‌గా మొదలై, పొలిటికల్ కాంట్రవర్సీకి మారి.. ఆపై ఎన్టీఆర్ ఆఫీస్ స్టేట్‌మెంట్ తో కాంట్రవర్సకి దారి తీసింది. ఇక సాయి రూప్ ప్రెస్ మీట్ నుంచి చివరికి అన్నింటినీ ప్యాకప్ చెప్పే పరిస్థితి వచ్చింది. ఇక ఈ కాంట్రవర్సీ విషయంలో ఫ్యాన్స్ ఎన్టీఆర్ నుంచి మరింత క్లారిటీ రావాలని కోరుకుంటున్నారు. మరి భవిష్యత్తులో ఇంకా ఏమైనా. క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
