మెగాస్టార్ డైరెక్టర్ తో మాస్ మహారాజా మూవీ?
రిజల్ట్ తో సంబంధం లేకుండా ఇయర్ మొత్తం ఏదొక సినిమాతో బిజీగా ఉండే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ కూడా ఒకరు.
By: Sravani Lakshmi Srungarapu | 10 Nov 2025 2:25 PM ISTరిజల్ట్ తో సంబంధం లేకుండా ఇయర్ మొత్తం ఏదొక సినిమాతో బిజీగా ఉండే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ కూడా ఒకరు. హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు ఒప్పుకోవడం, దాని కోసం కష్టపడటం, ఆ తర్వాత నెక్ట్స్ మూవీపై ఫోకస్ చేయడం.. రవితేజకు ఇంతే తెలుసు. అందుకే రవితేజ సక్సెస్ వచ్చిందని పొంగిపోవడం కానీ, ఫ్లాపు పడిందని నిరాశ చెందడం కానీ చేయరు.
కిషోర్ తిరుమలతో భర్త మహాశయులకు విజ్ఞప్తి
రీసెంట్ గా మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మాస్ మహారాజా, ఆ సినిమాతో ఫ్లాపును అందుకున్నారు. ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో తన 76వ సినిమాను చేస్తున్న రవితేజ, ఈ సినిమా తర్వాత ఓ కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. రవితేజ నెక్ట్స్ మూవీకి టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించనున్నారని సమాచారం.
వశిష్టతో రవితేజ సినిమా
మాస్ మహారాజాకు వశిష్ట ఓ కథ చెప్పగా, నెరేషన్ స్టేజ్ లోనే ఈ కథ నా స్టైల్ లోనే ఉందని రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, సినిమా స్క్రిప్ట్, రవితేజ డేట్స్ ఇప్పటికే లాక్ అయ్యాయని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వీలుందని తెలుస్తోంది. కిషోర్ తిరుమలతో రవితేజ చేస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి తర్వాత ఆయన చేయబోయే ప్రాజెక్టు ఇదేనని సమాచారం.
విశ్వంభరతో బిజీగా ఉన్న వశిష్ట
ఇక వశిష్ట విషయానికొస్తే బింబిసారతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న ఈయన, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర చేస్తున్నారు. ఆల్రెడీ విశ్వంభర తాలూకా షూటింగ్ పూర్తవగా, ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ లో విశ్వంభర రిలీజ్ కానుండగా, ఈ లోపు వశిష్ట తన నెక్ట్స్ మూవీని సెట్ చేసుకునే పనిలో ఉన్నారు. రవితేజతో వశిష్ట ఓ సైన్స్ ఫిక్షన్ మూవీని చేయనున్నారని అంటున్నారు. ఆల్రెడీ గత కొన్ని సినిమాలుగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ, వశిష్ట లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో చేతులు కలుపనున్నారని తెలిసిన ఫ్యాన్స్ ఈ విషయంలో సంతోషిస్తున్నారు.
