Begin typing your search above and press return to search.

BMW: ఇద్దరి భామల మధ్యలో మాస్ రాజా.. 'వామ్మో వాయ్యో'

సంక్రాంతి సీజన్ లో మాస్ మహారాజా రవితేజ సినిమా ఉందంటే, అందులో కచ్చితంగా ఒక మాస్ మసాలా సాంగ్ ఉండాల్సిందే.

By:  M Prashanth   |   2 Jan 2026 6:00 PM IST
BMW: ఇద్దరి భామల మధ్యలో మాస్ రాజా.. వామ్మో వాయ్యో
X

సంక్రాంతి సీజన్ లో మాస్ మహారాజా రవితేజ సినిమా ఉందంటే, అందులో కచ్చితంగా ఒక మాస్ మసాలా సాంగ్ ఉండాల్సిందే. ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్టే, రవితేజ నటిస్తున్న 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' (BMW) సినిమా నుంచి "వామ్మో వాయ్యో" అనే పాటను రిలీజ్ చేశారు. లిరికల్ వీడియో చూస్తుంటే పండగకు ముందే థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది.




ఈ పాటకు సంగీతం అందించింది భీమ్స్ సిసిరోలియో. గతంలో రవితేజకు 'ధమాకా' లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన భీమ్స్, ఈసారి కూడా తన మార్క్ మాస్ బీట్స్ తోనే వచ్చాడు. డప్పు సప్పుడు, ఫోక్ టచ్ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ పాటకు కావాల్సిన హై పిచ్ ని సెట్ చేశాడు. పాట వినగానే కాలు కదిపేలా ఉన్నా, ట్యూన్ పరంగా చూస్తే మరీ కొత్తగా అనిపించకపోవచ్చు, కానీ మాస్ ఆడియెన్స్ కు కావాల్సిన కిక్ మాత్రం ఉంది.

వీడియోలో విజువల్స్ చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. ఒక ఫాంటసీ విలేజ్ సెటప్ లాంటి బ్యాక్ డ్రాప్ లో, రిచ్ గా ఈ పాటను చిత్రీకరించారు. ఇక గ్లామర్ విషయానికి వస్తే, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి ఇద్దరూ పోటీపడి స్టెప్పులేశారు. రవితేజ పక్కన ఈ ఇద్దరు భామల స్క్రీన్ ప్రెజెన్స్ సాంగ్ కు మంచి కలరింగ్ ఇచ్చింది.

రవితేజ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వయసులో కూడా ఆయన వేసే స్టెప్పులు, ఆ బాడీ లాంగ్వేజ్ యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోదు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రవితేజ వేసిన సిగ్నేచర్ స్టెప్స్ సింపుల్ గా, స్టైలిష్ గా ఉన్నాయి. ఫ్యాన్స్ థియేటర్లో డ్యాన్స్ చేయడానికి, రీల్స్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ బాగా ఉపయోగపడతాయి. కాకపోతే రవితేజ నుంచి మనం రెగ్యులర్ గా చూసే స్టైల్ లోనే ఈ సాంగ్ కూడా సాగింది.

పాటలో లిరిక్స్ మాస్ జనాలకు అర్థమయ్యేలా క్యాచీగా ఉన్నాయి. దేవ్ పవార్ రాసిన "వామ్మో వాయ్యో.." అనే హుక్ లైన్ వెంటనే నోటికి ఎక్కేస్తుంది. సింగర్ స్వాతి రెడ్డి వాయిస్ ఈ పాటకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఆమె పాడిన హై పిచ్ విధానం పాటకు ఎనర్జీని తీసుకొచ్చింది. లిరిక్స్ లో పెద్ద డెప్త్ లేకపోయినా, బీట్ డామినేషన్ వల్ల అది పెద్దగా తెలియదు.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రమోట్ అవుతున్న ఈ సినిమాలో ఇలాంటి మాస్ సాంగ్ ఉండటం కమర్షియల్ గా ప్లస్ అయ్యే పాయింట్. ఇక సినిమాకు ఈ పాట ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.