పెదనాన్న అంటే పళ్లు రాల్తాయ్ అన్నాడా?
ఆయన అన్నట్టే మాధవ్, రవితేజగారు నిజంగానే అన్నాతమ్ముళ్లులాగానే ఉన్నారు. రవితేజగారు ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు అది అందరికీ తెలుసు.
By: Tupaki Entertainment Desk | 4 Feb 2026 10:34 PM ISTటాలీవుడ్ ఇండస్ట్రీలో వారసులకు కొదవే లేదు. ఒక్కో హీరో ఫ్యామిలీ నుంచి ఇద్దరు ముగ్గురు హీరోలు ఇప్పటికే రంగంలోకి దిగేశారు. మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఫ్యామిలీస్ నుంచి వారసులు రంగ ప్రవేశం చేసి కొంత మంది ఇప్పటికే స్టార్‌లుగా, పాన్ ఇండియా స్టార్‌లుగా క్రేజ్‌ని సొంతం చేసుకుని ఇండస్ట్రీలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇదే వరుసలో మాస్ మహారాజా ఫ్యామిలీ నుంచి కూడా హీరోగా రవితేజ సోదరుడి తనయుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే.
మాధవ్ భూపతిరాజు ముందు `మిస్టర్ ఇడియట్`తో హీరోగా పరిచయం అయినా ఆ మూవీ పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. మాధవ్‌కు ఎలాంటి ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో కొంత విరామం తీసుకుని బలమైన స్టోరీతో చేస్తున్న మూవీ `మారెమ్మ`. మంచాల నాగరాజు దర్శకుడు. మమూర్‌రెడ్డి బండారు నిర్మిస్తున్న ఈ మూవీని పక్కా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. తమిళ `హార్ట్‌బీట్` సిరీస్ ఫేమ్ దీప బాలు ఇందులో హీరోయిన్‌గా నటించింది.
బుధవారం ఈ మూవీ టీజర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా దర్శకుడు బాబి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. రవితేజగారితో కలిసి నేను వర్క్ చేస్తున్న దగ్గరి నుంచి మాధవ్ నాకు బాగా తెలుసు అది అందరికి తెలిసిందే. ఫస్ట్ సినిమా నుంచి ఆయనతో ట్రావెల్ అవుతున్నప్పడు రవితేజ బాబుతో పాటు మాధవ్‌ని కూడా చూస్తుండే వాడిని. ఇందాకే రవితేజగారిని నువ్వు ఏమని పిలుస్తావని అడిగితే `పెదనాన్న గిదనాన్న అంటే పళ్లు రాల్తాయ్ అన్నా అని చెప్పరా` అన్నాడట ఆయన.
ఆయన అన్నట్టే మాధవ్, రవితేజగారు నిజంగానే అన్నాతమ్ముళ్లులాగానే ఉన్నారు. రవితేజగారు ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు అది అందరికీ తెలుసు. కాబట్టే ఆయన నాకు తెలిసి మాధవ్‌ని కూడా తన కాళ్లమీద తనే నిలబడి ఎదగాలని కోరుకుంటున్నాడు. ఆ కారణంగానే ఆయన తన ప్రొడక్షన్ తరుపున కానీ, మరే విధంగా కానీ ప్రోత్సహించడం లేదు. తనని బరిలోకి వదిలేశారు. యుద్ధం ఇక తనే చేయాలి.. గెలవాలి..దానికి కంటెంట్ కావాలి.. రెగ్యులర్‌గా ఎవరైనా ఓమంచి లవ్ స్టోరీ..కొడితే రోప్‌లు కట్టి పదిమంది గాల్లో లెగిసేలా చూసుకుంటారు. అలాంటివి లేకుండా కంటెంట్‌ని నమ్ముకుని ఈ సినిమా చేసినట్టుగా టీజర్ చూస్తే అర్థమవుతోంది` అంటూ చెప్పుకొచ్చారు.
డైరెక్టర్ బాబి మాటలని బట్టి చూస్తుంటే రవితేజ తన సోదరుడి తనయుడు మాధవ్‌ని స్వయంకృషితో, ఎలాంటి సపోర్ట్ లేకుండా కంటెంట్ ని నమ్ముకుని సినిమాలు చేయమని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రవితేజ కావాలంటే తన సొంత బ్యానర్ ఆర్ టి సినిమాపై మాధవ్‌తో సినిమాలు చేయొచ్చు కానీ అలా కాకుండా మాధవ్‌కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి తనలాగే స్వతహాగా ఎదగాలని భావిస్తున్నారని స్పష్టమవుతోంది. మరి మాధవ్ భూపతిరాజు `మారెమ్మ` మూవీతో సక్సెస్‌ని సొంతం చేసుకుంటాడా? అన్నది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
