Begin typing your search above and press return to search.

వీరాధివీరులుగా రవితేజ, శ్రీ విష్ణు

త్వరలో సెట్స్ మీదికి వెళ్లబోతున్న ఈ చిత్రానికి క్రేజీ టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.

By:  Garuda Media   |   8 July 2026 9:00 PM IST
వీరాధివీరులుగా రవితేజ, శ్రీ విష్ణు
X

టాలీవుడ్లో ఒక క్రేజీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమైంది. మాస్ రాజా రవితేజ, ఎంటర్టైనర్లకు పేరుపడ్డ యంగ్ హీరో శ్రీ విష్ణు కలిసి నటించబోతున్నారు. విష్ణుతో రాజ రాజ చోర, శ్వాగ్ చిత్రాలను రూపొందించిన యువ దర్శకుడు హాసిత్ గోలి ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.

త్వరలో సెట్స్ మీదికి వెళ్లబోతున్న ఈ చిత్రానికి క్రేజీ టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాాచారం. ‘వీరాధి వీరులంట’ అనే పేరుతో ఈ సినిమా రూపొందనుందట. హీరోయిగ్గా ఉంటూనే క్యాచీగా అనిపించే అచ్చ తెలుగు టైటిల్ పెట్టి హాసిత్ గోలి తన అభిరుచిని చాటాడు. ఈ టైటిల్ ఈజీగా జనాల్లోకి వెళ్లిపోతుందనడంలో సందేహం లేదు. త్వరలోనే ఈ పేరును అధికారికంగా కూడా ప్రకటించనున్నట్లు సమాచారం.

రవితేజ ఈ మధ్య మాస్ చిత్రాలను పక్కనపెట్టి విభిన్న చిత్రాల వైపు అడుగులు వేస్తున్నాడు. ఆయన వినోదాన్ని బాాగా పండించగలరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘వెంకీ’, ‘ఆంజనేయులు’ సహా ఎన్నో చిత్రాల్లో కామెడీ ఇరగదీశాడు మాస్ రాజా. ఇక శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ గోదావరి వెటకారంతో పంచులు వేశారంటే అదిరిపోతుందనడంలో సందేహం లేదు. హాసిత్ తీసిన రెండు చిత్రాల్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.

కాబట్టి ఈ కలయికలో మాంచి వినోదాత్మక చిత్రం రూపొందే అవకాశముంది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ టైంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు మంచి రీచ్ ఉంటుంది. ఈ కాంబినేషన్ మీద ఉన్న అంచనాలకు తగ్గ వినోదం సినిమాలో ఉంటే బాక్సాఫీస్ దగ్గర ఓ పెద్ద హిట్ పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగుతున్న టీం.. తక్కువ బడ్జెట్లో, వర్కింగ్ డేస్‌లో సినిమాను పూర్తి చేయాలని చూస్తోంది.