ఆ దేశంలో రవితేజ నెక్స్ట్.. హడావుడి షురూ!
కానీ, రవితేజ రూటే సెపరేటు. 'మాస్ జాతర' హడావుడి ఇంకా మొదలవ్వకముందే, ఆయన తన తదుపరి చిత్రం షూటింగ్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ స్పీడ్ చూసి ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.
By: M Prashanth | 24 Oct 2025 1:00 PM ISTమాస్ మహారాజా రవితేజ.. ఈ పేరు వింటేనే గుర్తొచ్చేది నాన్ స్టాప్ ఎనర్జీ, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా, ఆయన తన పని తాను చేసుకుంటూ దూసుకుపోతారు. ప్రస్తుతం ఆయన నటించిన 'మాస్ జాతర' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 31న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రమోషన్లను కూడా చిత్రయూనిట్ మొదలుపెట్టింది.
ఒక సినిమా విడుదలకు సిద్ధమవుతుంటే, సాధారణంగా హీరోలు ఆ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటారు. కానీ, రవితేజ రూటే సెపరేటు. 'మాస్ జాతర' హడావుడి ఇంకా మొదలవ్వకముందే, ఆయన తన తదుపరి చిత్రం షూటింగ్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ స్పీడ్ చూసి ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.
రవితేజ నెక్స్ట్ ప్రాజెక్ట్ (RT76)కు టాలెంటెడ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లోని వాలెన్సియాలో శరవేగంగా జరుగుతోంది. ఈ విషయాన్ని స్పానిష్ ఫిట్‌నెస్ మోడల్, యాక్టర్ సెర్గి కాన్స్టాన్స్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా బయటపెట్టారు.
సెర్గి తన పోస్టులో, "ఇండియన్ సినిమా నా సిటీ వాలెన్సియాకు వచ్చింది. సూపర్‌స్టార్ రవితేజను కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన తన కొత్త తెలుగు సినిమా (RT76) షూటింగ్‌ను మా సొంత ఊరిలో, స్పెయిన్‌లోని ఇతర అందమైన లొకేషన్లలో చేస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ కిషోర్ తిరుమలతో మాట్లాడటం ఒక అద్భుతమైన అనుభవం" అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌తో పాటు, రవితేజ, కిషోర్ తిరుమలతో దిగిన ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు.
ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'మాస్ జాతర' రిలీజ్‌కు పది రోజుల ముందు నుంచే, రవితేజ తన 76వ సినిమా షూటింగ్‌లో ఇంత యాక్టివ్‌గా ఉండటం ఆయన డెడికేషన్‌ను చూపిస్తోంది. అంతేకాదు, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి (జనవరి 13న) విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే, 'మాస్ జాతర' విడుదలైన కేవలం రెండున్నర నెలల్లోనే మరో సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకు రానున్నారన్నమాట.
