అదా..ఇదా...డిసైడ్ అయ్యేది అమావాస్యకా!
మాస్ రాజా రవితేజ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది.
By: Srikanth Kontham | 5 Oct 2025 9:00 PM ISTమాస్ రాజా రవితేజ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది. కొత్త షెడ్యల్ స్పెయిన్ లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తు న్నారు. ఇందులో రెండు పాటలు సహా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిం చనున్నారు. దీంతో షూటింగ్ దాదాపు ముగిసినట్లేనని చిత్ర వర్గాల నుంచి తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే `అనార్కలీ` అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా `భర్త మహాశయులకు విజ్ఞప్తి` అనే మరో టైటిల్ కూడా వెలుగులోకి వచ్చింది.
ఈ రెండు టైటిల్స్ లో ఏదో ఒకటి మేకర్స్ నిర్ణయించే అవకాశం ఉందంటున్నారు. టైటిల్ కు సంబంధించి ఓ ప్రత్యేక వీడియోతో రివీల్ చేయాలని ప్లాన్ చేస్తున్నా రుట. మరి అందుకు ముహూర్తం ఎప్పుడు? అంటే సరిగ్గా అమావాస్య రోజున రివీల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారుట. అదే రోజున దీపావళి పండుగ కావడంతో ఆ రోజు ప్లాన్ చేస్తున్నారుట. దీనికి సంబంధించి మేకర్స్ అధికారికంగా వెల్లడిస్తే గానీ క్లారిటీ రాదు. రవితేజ మార్క్ యాక్షన్, వినోదాల మేళవింపుతో సాగే కుటుంబ కథా చిత్రంగా లీకులందుతున్నాయి.
మాస్ రాజా ఇమేజ్ ని ఎక్కడా తగ్గించుకుండా బ్యాలెన్స్ చేస్తూనే కిషోర్ మార్క్ ఎంటర్ టైనర్ గా మలుస్తున్నట్లు తెలుస్తోంది. `నేను శైలజ` తో దర్శకుడిగా పరిచయమైన కిషోర్ కుమార్ తెరకెక్కించిన సినిమాలన్నీ బాగానే ఆడాయి. `ఉన్నది ఒకటే జిందగీ`, `చిత్ర లహరి`, `ఆడవారు మీకు జోహార్లు` చిత్రాలు బాగానే ఆడాయి. `రెడ్` తో ఓ కొత్త ప్రయోగం చేసాడు. విమర్శకులు మెచ్చిన చిత్రంగా నిలిచినా ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఈ నేపథ్యంలో రవితేజ తో హిట్ కొడతాడనే అంచనాలు ఉన్నాయి.
రవితేజ కూడా రొటీన్ సినిమాలు చేయడంతో వాటికి కాస్త భిన్నమైన సినిమాగా ఈ చిత్రం హైలైట్ అవుతోంది. అన్ని పనులు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి రేసులో చిరంజీవి 157వ సినిమా రేసులో ఉంది. ఇంకా ఆ సీజన్ లో మరికొన్ని సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అందులో ఓ సినిమా గా రవితేజ డేట్ లాక్ చేసే అవకాశం ఉంది.
