Begin typing your search above and press return to search.

భర్త మహాశయులకు విజ్ఞప్తి.. అలా జరగకపోతే మంచిదే!

రీసెంట్ గా మేకర్స్ టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంది.

By:  M Prashanth   |   11 Nov 2025 7:00 PM IST
భర్త మహాశయులకు విజ్ఞప్తి.. అలా జరగకపోతే మంచిదే!
X

టాలీవుడ్ సీనియర్ హీరో, మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్పీడ్ గా జరుపుకుంటోంది.

రీసెంట్ గా మేకర్స్ టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వైబ్స్ ను అందించిందనే చెప్పాలి. సినిమాలో రవితేజ రామ సత్యనారాయణ పాత్రలో కనిపించనుండగా.. మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా ఉండనున్నట్లు ఫుల్ క్లారిటీ వచ్చింది.

అదే సమయంలో సినిమా.. రవితేజ ఇప్పటికే యాక్ట్ చేసిన సారొచ్చారు మూవీ తరహా టోన్ లోనే ఉండనున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పరశురామ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా 2012లో రిలీజ్ అయింది. రవితేజ, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఆ మూవీ.. అప్పట్లో అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ అందుకోలేకపోయింది.

ఇప్పుడు ఆ మూవీ తరహాలోనే భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఉండొచ్చని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో గతంలో రవితేజ.. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ బలాదూర్ చేసిన విషయం తెలిసిందే. రవితేజ, అనుష్క జంటగా నటించిన ఆ మూవీ.. 2008లో థియేటర్స్ లో రిలీజైంది.

అ సినిమా కూడా అప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి ఎలాంటి రిజల్ట్ సొంతం చేసుకుంటుందోనని సినీ ప్రియులు డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే రవితేజ కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వరుస సినిమాలు చేస్తున్నా క్లిక్ అవ్వడం లేదు.

భారీ అంచనాల మధ్య ఆయా సినిమాలు.. ప్రేక్షకుల ముందుకు వచ్చినా హిట్స్ గా మారడం లేదు. దీంతో ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు రవితేజ. అయితే ఆ టోన్ లో ఇప్పటికే చేసిన బలాదూర్, సారొచ్చారు సినిమాలు ఆడియన్స్ ను అంతగా అలరించలేదు. అందుకే భర్త మహాశయులకు విజ్ఞప్తి విషయంలో అదే జరగకపోతే మంచిది. మరేమవుతుందో వేచి చూడాలి.