చిక్కుల్లో పడ్డ మాస్ జాతర..?
మాస్ మహారాజ్ రవితేజ మాస్ జాతర సినిమాతో రాబోతున్నాడు. భాను భోగవరపు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సితార నాగవంశీ నిర్మించారు.
By: Ramesh Boddu | 16 Aug 2025 11:49 AM ISTమాస్ మహారాజ్ రవితేజ మాస్ జాతర సినిమాతో రాబోతున్నాడు. భాను భోగవరపు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సితార నాగవంశీ నిర్మించారు. సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ధమాకా తర్వాత వీళ్లిద్దరు చేస్తున్న సినిమా అవ్వడంతో మాస్ జాతర మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఐతే మాస్ జాతర సినిమా అసలైతే ఈ నెల 27న రావాల్సి ఉంది. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం సినిమా వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట.
రవితేజ ఎనర్జీ ఓకే కానీ..
సినిమా రిలీజ్ కు ఇంకా 12 రోజులు మాత్రమే ఉన్నా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాలేదట. అది అవ్వాలి ప్రమోషన్స్ మొదలు పెట్టాలి ఇవన్నీ ఈ కొద్ధి టైమ్ లో జరగడం కష్టం. అందుకే సినిమా వాయిదా వేయాలని అనుకుంటున్నారట. ఐతే మాస్ జాతర టీజర్ లో రవితేజ ఎనర్జీ ఓకే కానీ ఆయన పోలీస్ అవ్వడం విలన్లను చితక బాడడం.. మాస్ డైలాగ్ చెప్పడం ఇది కామన్ అయ్యింది. ఇలాంటి డైలాగ్స్ కి పడిపోయే రోజులు ఎప్పుడో పోయాయి.
అందుకే మాస్ జాతరకు అంత బజ్ కూడా లేదు. పోనీ రిలీజ్ 12 డేస్ మాత్రమే కదా అని ప్రమోషన్స్ మొదలు పెట్టారా అంటే అది లేదు. అందుకే మాస్ జాతర వాయిదా వేయడమే కరెక్ట్ అనుకుంటున్నారట మేకర్స్. ఇదిలాఉంటే రీసెంట్ గా కింగ్ డమ్ తో షాక్ తిన్న నాగవంశీ వార్ 2 విషయంలో కూడా టెన్షన్ గానే కనిపిస్తున్నాడు. వార్ 2 సినిమా హిందీ కన్నా తెలుగులో ఎక్కువ వసూళ్లు తెస్తుందని అనుకోగా అతని అంచనాలు తారుమారయ్యాయి.
కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు..
ఈ టైమ్ లో మాస్ జాతర రిలీజ్ కష్టమనే రిలీజ్ పోస్ట్ పోన్ ఏర్పాట్లు చేస్తున్నారట. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. మాస్ జాతర ఆగుష్టు 27 నుంచి వాయిదా పడితే మాత్రం సెప్టెంబర్ నెల మొత్తం వరుస సినిమాలు ఉన్నాయి కాబట్టి కష్టమే.. ఇక సినిమా అక్టోబర్ సెకండ్ హాఫ్ లేదా నవంబర్ లో రిలీజ్ ప్లాన్ చేయాలి. మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనుకుంటున్నారో కానీ రవితేజ ఫ్యాన్స్ కి మాత్రం ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు.
ధమాకా తర్వాత రవితేజ హిట్టు కోసం చూస్తున్నాడు. మాస్ జాతర టీజర్ లో రవితేజ డైలాగ్స్ ఎప్పటిలానే ఉన్నాయి వాటికి తగిన కథ ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. మరి ఈసారి మాస్ రాజా ఏం చేస్తాడో చూడాలి.
