స్పెయిన్ లో నెల రోజులు మాస్ రాజా!
మాస్ రాజా రవితేజ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 23 Sept 2025 12:03 PM ISTమాస్ రాజా రవితేజ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది కిషోర్ మార్క్ క్లాసిక్ ఎంటర్ టైనర్ గా తెలుస్తోంది. రవితేజ మాస్ ని టచ్ చేస్తూనే తనదైన క్లాసిక్ చిత్రంగా మలుస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైన దగ్గర నుంచి హైదరాబాద్ లో నే జరుగుతోంది. అవసరం మేర ఇతర రాష్ట్రాల్లో కొంత భాగం షూట్ చేసారు. తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తవ్వడంతో కొత్త షెడ్యూల్ కి రంగం సిద్దం చేస్తున్నారు. దీనిలో భాగంగా స్పెయిల్ ఓ భారీ షెడ్యూల్ వేసారు.
నెల రోజులు అక్కడే:
అక్టోబర్ తొలి వారం నుంచి స్పెయిన్ లో షూటింగ్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు నెల రోజుల పాటు చిత్రీకరణ అక్కడే ఉంటుందని తెలుస్తోంది. రవితేజ తో పాటు కీలక నటీనటులపై అక్కడ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అలాగే రవితేజ-హీరోయిన్ లపై కొన్ని పాటలు కూడా తెరకెక్కించనున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో స్పెయిన్ లో లాంగ్ షెడ్యూల్ వేసినట్లు తెలుస్తోంది. వినోదంతో నిండిన కుటుంబ కథా చిత్రానికి స్పెయిన్ నేపథ్యానికి ప్రాధాన్యత ఉన్న చిత్రమిది. ఇందులో రవితేజ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు.
క్లాసిక్ చిత్రంలో కొత్తగా:
ఇంత వరకూ ఇలాంటి లుక్ రాజా ట్రై చేయలేదంటున్నారు. క్లాసిక్ లుక్ అభిమానులకు కొత్త ఫీల్ ని అందిస్తుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఆయన రోల్ కూడా ఎంటర్ టైనింగ్ గా ఉంటుందని లీకులందుతున్నాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ కల్లా అన్ని పనులు పూర్తి చేసి సిద్దంగా ఉండాలన్నది మేకర్స్ ప్లాన్. ఈ సినిమా విజయం కూడా రవితేజకు అత్యంత కీలకం. కొంత కాలంగా రవితేజను వరుస పరాజయాలు వెంటాడుతోన్న సంగతి తెలిసిందే.
రెండు రకాలుగా రాజా జర్నీ:
'ధమాకా' తర్వాత సరైన హిట్ ఒక్కటి లేదు. చేసిన సినిమాలేవి కలిసి రావడం లేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవ్వడం..బాక్సాఫీస్ వద్ద చతికిల పడటం పరిపాటిగా మారింది. అయినా రవితేజ పంథా ఎక్కడా మారలేదు. తన మార్క్ మాస్ కమర్శియల్ కంటెంట్ ని పక్కన బెట్టలేదు. ఓవైపు వాటికి కమిట్ అవుతూనే వైవిథ్యమైన కథా బలం ఉన్న చిత్రాలకు ఆసక్తి చూపుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాతో పాటు, భాను బోగవరపు దర్శకత్వంలో `మాస్ జాతర` కూడా చేస్తోన్న సంగతి తెలిసిందే.
