Begin typing your search above and press return to search.

రవితేజ బాల్యంలో గడిపిన తన ఇంటిని చూశారా.. హైలెట్ ఏంటంటే?

ప్రస్తుతం మరో ప్రాజెక్టు అనౌన్స్మెంట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

By:  Madhu Reddy   |   22 Jan 2026 6:00 AM IST
రవితేజ బాల్యంలో గడిపిన తన ఇంటిని చూశారా.. హైలెట్ ఏంటంటే?
X

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన హీరోలలో రవితేజ కూడా ఒకరు. ఇప్పటికీ యంగ్ హీరోలకు తన సినిమాలతో గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది 'మాస్ జాతర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాతో జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదు అనిపించుకున్నారు.

ప్రస్తుతం మరో ప్రాజెక్టు అనౌన్స్మెంట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే తాజాగా రవితేజ.. తన బాల్యంలో గడిపిన తన చిన్ననాటి ఇంటికి సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లా, ఖండవెల్లి గ్రామంలో మాస్ మహారాజా హీరో రవితేజ జన్మించారు. రవితేజ తల్లిదండ్రులు కూడా ఇదే ప్రాంతంలో జీవనం కొనసాగించేవారు. పైగా రవితేజ సినీ ప్రస్థానం కూడా ఇక్కడినుంచి మొదలయ్యింది. రవితేజ తండ్రి(భూపతి రాజు రాజగోపాల రాజు) జన్మస్థలం ఖండువెల్లి. రవితేజ తండ్రి వారు ఐదు మంది అన్నదమ్ములు. అందులో పెద్దవాడే రవితేజ తండ్రి. వీరి కుటుంబంలో అప్పట్లో అందరూ కూడా ఇంజనీరింగ్ చదివారు. వీరిలో కొంతమంది విదేశాలలో సెటిల్ అయ్యారు. రవితేజ ఫాదర్ కెమికల్ డిపార్ట్మెంట్లో కెమిస్ట్రీ చేశారు. హైదరాబాద్, జైపూర్ వంటి ప్రాంతాలలో కూడా కొద్ది రోజులు పని చేశారు కూడా రవితేజ ఇక్కడే పుట్టినప్పటికీ, తన తండ్రి ఉద్యోగరీత్యా నార్త్ సైడ్ పెరిగారు. అయితే ఆస్తిపాస్తులు, బంధువులు అందరూ కూడా ఇక్కడే ఉన్నామంటూ రవితేజ కుటుంబీకులో ఒకరు ఈ విషయాన్ని తెలిపారు.

రవితేజ తండ్రికి సంబంధించిన అన్నదమ్ములు అందరూ కూడా వచ్చి పోతూ ఉంటారని, ఇదే ఊరిలో ఉండే వేణుగోపాలస్వామి దగ్గర ఐదు మంది షష్టిపూర్తి చేసుకున్నారని తెలిపారు. రవితేజ బ్రదర్స్ కూడా ముగ్గురు అన్నదమ్ములని, ముగ్గురు కూడా సినిమా యాక్టర్స్. రవితేజ, ఆయన తమ్ముళ్లు ఇద్దరు కూడా ఖండవెల్లి వచ్చేవారిని తెలియజేశారు. ఇకపోతే రవితేజ తన బాల్యంలో నివసించిన ఆ ఇల్లు ప్రస్తుతం శిథిలావస్థ స్థితిలో ఉంది. అయినా సరే అక్కడ ఉన్న వారి బంధువులు ఆ ఇంటి ఆవరణంలో పండ్ల చెట్లను.. పూల చెట్లను పెంచుతున్నారు.

ముఖ్యంగా అక్కడి నీటి బావి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఇవన్నీ అక్కడ శిథిలావస్థలో ఉన్నా.. అక్కడి పచ్చని వాతావరణం మరింత ఆహ్లాదంగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవ్వడంతో రవితేజ ఇంత అద్భుతమైన వాతావరణంలో తన బాల్యాన్ని గడిపారా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే రవితేజ బాల్య జ్ఞాపకాలు ఇప్పుడు అభిమానులను కూడా సంతోష పరుస్తూ ఆకట్టుకుంటున్నాయి.