సెన్సార్ పూర్తి చేసుకున్న రవితేజ BMW మూవీ.. రన్ టైమ్ ఎంతంటే?
టాలీవుడ్ బాక్సాఫీస్ కి సంక్రాంతి అతిపెద్ద పండుగ అని చెప్పాలి. చిన్న హీరోలను మొదలుకొని పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరు ఈ సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేసి సక్సెస్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు.
By: Madhu Reddy | 11 Jan 2026 11:49 AM ISTటాలీవుడ్ బాక్సాఫీస్ కి సంక్రాంతి అతిపెద్ద పండుగ అని చెప్పాలి. చిన్న హీరోలను మొదలుకొని పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరు ఈ సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేసి సక్సెస్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి మొదలైంది. జనవరి 9వ తేదీన మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు మిక్స్డ్ టాక్ తో నడుస్తోంది. అలాగే జనవరి 12వ తేదీన చిరంజీవి, ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న 'మన శంకర్ వరప్రసాద్ గారు' సినిమా విడుదల కాబోతోంది. అలాగే జనవరి 13న సక్సెస్ కొట్టాలని గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న మాస్ మహారాజా రవితేజ ' భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
రొమాంటిక్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. రవితేజ సరసన డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా నిర్వహించగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సెన్సార్ కూడా పూర్తయింది.. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ అందించారు.
ఇకపోతే ఈ సినిమాలో ఎటువంటి వివాదాస్పదమైన అంశాలు, అభ్యంతరకరమైన సన్నివేశాలు లేకపోవడం వల్లే ఈ సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే కొన్ని డైలాగ్స్, సన్నివేశాలకు మాత్రం కొంచెం మార్పులు సూచించగా చిత్ర యూనిట్ వాటిని మార్చి మళ్లీ అధికారులకు చూపించగా వారు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇకపోతే ఈ సినిమా 16 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే.. కాకపోతే పదహారేళ్ళకు దిగువన ఉండే ఆడియన్స్ తల్లిదండ్రుల సమక్షంలో సినిమా చూడాల్సి ఉంటుందని సెన్సార్ సర్టిఫికెట్ నిబంధనలలో తెలిపారు. పైగా ఈ సినిమాను 2 గంటల 22 నిమిషాల నిడివితో లాక్ చేశారు. అంటే 142 నిమిషాల రన్ టైమ్ ని ఫిక్స్ చేశారు.
ఇదిలా ఉండగా సెన్సార్ పూర్తయిన తర్వాత తమ ఫస్ట్ రివ్యూ ని పంచుకున్నారు సెన్సార్ సభ్యులు. అందులో భాగంగానే అప్పటికే పెళ్లైన రామ్(రవితేజ ) స్పెయిన్ పర్యటనలో మానస (ఆషిక రంగనాథ్) కు దగ్గరవుతాడు. భార్య బాలామణి (డింపుల్ హయతి)కి రామ్ కి మధ్య జరిగిన సంఘర్షణ ఏమిటి? మానస జీవితంలోకి వచ్చిన తర్వాత రామ్ లైఫ్ లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి? ముఖ్యంగా భార్యను కాదని మానసకు దగ్గర అవడానికి గల కారణం ఏమిటి? ఈ విషయం భార్యకు తెలియకుండా ఎలా హ్యాండిల్ చేశాడు? అనే విషయం తెలియాలి అంటే పూర్తి సినిమా చూడాల్సిందే. ఇక వెన్నెల కిషోర్ - సత్య మధ్య వచ్చే కామెడీ ట్రాక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందట. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా రవితేజకు గ్రాండ్ సక్సెస్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
