ట్రైలర్ టాక్: కంప్లీట్ గా రూట్ మార్చేసిన మాస్ మహారాజా
సంక్రాంతి బరిలో గట్టి పోటీ నడుమ రిలీజవుతున్న ఈ మూవీకి ఇప్పటికే మంచి బజ్ నెలకొనగా, తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
By: Sravani Lakshmi Srungarapu | 7 Jan 2026 5:23 PM ISTభర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు మాస్ మహారాజా రవితేజ. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా చేసుకుని రూపొందింది. సంక్రాంతి బరిలో గట్టి పోటీ నడుమ రిలీజవుతున్న ఈ మూవీకి ఇప్పటికే మంచి బజ్ నెలకొనగా, తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఆకట్టుకునేలా భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్
కాగా 2.19 నిమిషాల నిడివి కలిగిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. పెద్దగా సస్పెన్స్ ఏమీ లేకుండా ట్రైలర్ లోనే కథ మొత్తాన్ని చెప్పేశారు డైరెక్టర్ కిషోర్ తిరుమల. ఓ పెళ్లైన మగాడు, మరో ఆడదాని ప్రేమలో పడటం, ఆ తర్వాత వచ్చే పరిణామాలకు ఇద్దరి ఆడాళ్ల నడుమ ఆ మగాడు ఎలా నలిగిపోయాడనే అంశంపై సినిమా తెరకెక్కినట్టు అనిపిస్తుంది.
ఎంటర్టైన్మెంట్ తో పాటూ ఎమోషన్స్ కూడా
సినిమాలో ఫ్యామిలీ బాండింగ్స్ తో పాటూ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ అన్నింటినీ కలగలిపి కంప్లీట్ ఫెస్టివల్ ఫిల్మ్ గా తీర్చిదిద్దినట్టు అనిపిస్తోంది. మొత్తానికి పండగ టైమ్ లో ఫ్యామిలీతో కలిసి చూడ్డానికి భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ పర్ఫెక్ట్ గా ఉంటుందనేలా మేకర్స్ ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో రవితేజ భిన్నంగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ లో రవితేజ ఎమోషన్, ఎనర్జీ చాలా డిఫరెంట్ గా ఉంటాయని అర్థమవుతుంది.
ట్రైలర్ తో పెరగనున్న బజ్
ఈ సినిమా టైటిల్స్ లో రవితేజ తన పేరుకి ముందు మాస్ మహారాజా అనే ట్యాగ్ ను వేయొద్దని చెప్పారని డైరెక్టర్ కిషోర్ తిరుమల చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ట్రైలర్ ను చూస్తే రవితేజ ఆ మాట ఎందుకో చెప్పారో అర్థమవుతుంది. డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ గ్లామర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండేట్టు అనిపిస్తోంది. సత్య, వెన్నెల కిషోర్, సునీల్, మురళీధర్ గౌడ్ కామెడీ కూడా వర్కవుట్ అయినట్టే అనిపిస్తోంది. జానర్ కు తగ్గట్టు భీమ్స్ మ్యూజిక్ కూడా బాగా సెట్ అయింది. ట్రైలర్ లాగానే సినిమా కూడా ఉంటే రవితేజకు ఈ సారి పండగ సమయాన సూపర్ హిట్ పడటం ఖాయమే. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు ట్రైలర్ తో సినిమాపై బజ్ మరింత పెరిగే అవకాశముంది.
