రవితేజ BMW టీజర్.. ఎలా ఉందంటే..
కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పుడిప్పుడే బజ్ పెరుగుతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ ఆ అంచనాలను మరో మెట్టు ఎక్కించి, వినోదాల విందు ఖాయం అనిపించేలా ఉంది.
By: M Prashanth | 19 Dec 2025 5:56 PM ISTమాస్ మహారాజా రవితేజ అంటేనే హై వోల్టేజ్ ఎనర్జీ. కానీ ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వరుసగా సీరియస్ యాక్షన్ సినిమాలే వస్తున్నాయి. రవితేజ మార్క్ కామెడీని, ఆ టైమింగ్ ను ఫ్యాన్స్ గట్టిగా మిస్ అవుతున్నారు. ఆ లోటు తీర్చడానికే 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' (BMW) అంటూ వస్తున్నారు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పుడిప్పుడే బజ్ పెరుగుతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ ఆ అంచనాలను మరో మెట్టు ఎక్కించి, వినోదాల విందు ఖాయం అనిపించేలా ఉంది.
టీజర్ స్టార్టింగ్ నుంచే రవితేజ తనదైన స్టైల్ లో నవ్వులు పూయించారు. ఇందులో ఆయన క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా, కాస్త కొంటెగా ఉంది. ఒకవైపు "నా భార్య అంటే నాకు ప్రాణం" అని అమాయకంగా చెబుతూనే, మరోవైపు బయట వ్యవహారాలు నడిపే చిలిపి భర్తగా రవితేజ చేసే రచ్చ మామూలుగా లేదు. "ఎవరైతే తప్పు చేసి.. ఆ తప్పు భార్యకు తెలిస్తే ఆమె బాధపడుతుందని భయపడతాడో.. వాడే అసలు సిసలైన మొగుడు" అనే ఫిలాసఫీ నవ్వులు తెప్పిస్తోంది.
చాలా ఏళ్ల తర్వాత రవితేజలో ఆ పాత కామెడీ టైమింగ్ మళ్ళీ కనిపిస్తోంది. 'వెంకీ', 'దుబాయ్ శీను' సినిమాల్లోని రవితేజ బాడీ లాంగ్వేజ్, ఆ ఈజ్ మళ్ళీ ఈ టీజర్ లో చూస్తుంటే ఫ్యాన్స్ కు పండగే. అలాగే సునీల్ కూడా ఒకప్పటీ కమెడియన్ లా కనిపించేలా ఉన్నాడు. సీరియస్ గా ఫేస్ పెట్టి సెటైర్లు వేయడం రవితేజ స్టైల్. అది ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా వర్కవుట్ అయినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా సైకాలజిస్ట్ దగ్గర ఆయన ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ హిలేరియస్ గా ఉన్నాయి.
ఇక ఈ టీజర్ లో మరో హైలైట్ అంటే సునీల్, రవితేజ కాంబినేషన్. వీరిద్దరూ స్క్రీన్ మీద పక్కపక్కన కనిపిస్తేనే ఆటోమేటిక్ గా నవ్వు వచ్చేస్తుంది. చాలా కాలం తర్వాత వీరిద్దరి మధ్య మంచి కామెడీ ట్రాక్ సెట్ అయినట్లు అర్థమవుతోంది. వెన్నెల కిషోర్ కూడా తన మార్క్ కామెడీతో అలరించనున్నాడని హింట్ ఇచ్చారు. హీరోయిన్లు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి గ్లామర్ డోస్ కూడా గట్టిగానే ఉంది.
టెక్నికల్ గా చూస్తే సినిమా చాలా రిచ్ గా ఉంది. సుధాకర్ చెరుకూరి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫారిన్ లొకేషన్స్, కలర్ ఫుల్ విజువల్స్ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉన్నాయి. భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ టీజర్ కు మంచి వైబ్ ఇచ్చింది. కిషోర్ తిరుమల రవితేజను చాలా ఫ్రెష్ గా, ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చేలా ప్రెజెంట్ చేశారనిపిస్తోంది.
ఏదేమైనా ఈ 'BMW' టీజర్ తో రవితేజ సంక్రాంతి రేసులో కాంపిటీషన్ ఇచ్చేలా కనిపిస్తోంది. కంటెంట్ క్లిక్కయితే ఇలాంటి సినిమాలకు తిరుగుండదు. గతంలో మిరపకాయ్ సినిమాలో కూడా ఇద్దరు భామల మధ్య మాస్ రాజా ట్రాక్ గట్టిగానే క్లిక్కయ్యింది. జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా, పక్కాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. ఇక రిలీజ్ తరువాత జనాలు ఎంతవరకు ఎట్రాక్ట్ అవుతారో చూడాలి.
