మాస్టర్ ప్లాన్ తో.. మాస్ రాజా అనార్కలి..!
మాస్ మహారాజ్ రవితేజ నెక్స్ట్ మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార నాగవంశీ నిర్మిస్తున్నారు.
By: Ramesh Boddu | 3 Oct 2025 12:46 PM ISTమాస్ మహారాజ్ రవితేజ నెక్స్ట్ మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార నాగవంశీ నిర్మిస్తున్నారు. మాస్ జాతర సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ధమాకా హిట్ పెయిర్ మరోసారి మాస్ ఆడియన్స్ కి జాతర శోభ తెచ్చేలా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా రిలీజ్ విషయంలో కాస్త కన్ ఫ్యూజన్ ఏర్పడగా ఫైనల్ గా అక్టోబర్ 31న ఈ సినిమా రిలీజ్ లాక్ చేశారు. ఈసారి మాస్ రాజా ఫ్యాన్స్ కి కచ్చితంగా మాస్ ఫీస్ట్ అంటున్నారు మేకర్స్.
ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్..
ఇక ఈ సినిమా తర్వాత రవితేజ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. అనార్కలి టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో కెతిక శర్మ, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కిషోర్ తిరుమల సినిమాలన్నీ చాలా సైలెంట్ గా ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ గా ఉంటాయి. అతను మాస్ మహారాజ్ రవితేజతో సినిమా చేయడం సంథింగ్ స్పెషల్ గా ఉంది. ఐతే ఈ సినిమా యూరప్ షెడ్యూల్ ఒక్కటి పెండింగ్ ఉందట.
త్వరలోనే యూరప్ వెళ్లి అక్కడ లాంగ్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేస్తారట. ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉంది. ఎస్.ఎల్.వి బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. అనార్కలి సినిమా రవితేజ సినిమాల్లో ప్రత్యేకమైన సినిమాగా మరోసారి రవితేజ వింటేజ్ డేస్ ని గుర్తు చేసేలా ఉంటుందని అంటున్నారు.
మాస్ జాతర రిలీజ్ అవ్వడమే ఆలస్యం..
మాస్ జాతర రిలీజ్ అవ్వడమే ఆలస్యం నవంబర్ కల్లా అనార్కలిని కూడా పూర్తి చేసి జనవరి రిలీజ్ కు రెడీ అవ్వాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. రవితేజ అనార్కలి దూకుడు చూస్తుంటే కచ్చితంగా సినిమా సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంది. ఐతే సంక్రాంతి బరిలో ఆల్రెడీ చిరంజీవి మన శంకరవరప్రసాద్, ప్రభాస్ రాజా సాబ్ వస్తున్నాయి. అవి చాలదు అన్నట్టు నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు వస్తుంది. రవితేజ అనార్కలి కూడా పొంగల్ ఫైట్ కి రెడీ అనేస్తున్నారు. మరి ఈ టఫ్ ఫైట్ లో ఎవరు విజేతగా నిలుస్తారన్నది చూడాలి.
రవితేజ కూడా ఈమధ్య వరుస ఫ్లాపులతో కెరీర్ కాస్త ట్రాక్ తప్పారు. అందుకే రాబోతున్న రెండు సినిమాలతో రవితేజ మరోసారి తన ఎనర్జీ ఏంటన్నది చూపించాలని ఫిక్స్ అయ్యారు. రవితేజ మాస్ జాతర, అనార్కలి రెండు కూడా సంథింగ్ క్యూరియస్ గా మాస్ రాజా ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ ఇచ్చేలా ఉన్నాయి.
