Begin typing your search above and press return to search.

నా కొడుకును ఆర్జీవీ దగ్గరకు పంపి తప్పు చేశాను - ఆది పినిశెట్టి తండ్రి

ఈ క్రమంలోనే ఆయనను రామ్ గోపాల్ వర్మ దగ్గరకు పంపించారని, అదే ఆయన చేసిన తప్పు అని ఇంటర్వ్యూలో చెప్పారు.

By:  M Prashanth   |   8 Aug 2025 7:59 PM IST
నా కొడుకును ఆర్జీవీ దగ్గరకు పంపి తప్పు చేశాను - ఆది పినిశెట్టి తండ్రి
X

టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆయన సోదరుడు సత్య ప్రభాస్ పినిశెట్టి గురించి మాత్రం ఎక్కువ మందికి తెలియదు. ఆయన ఆది పినిశెట్టి లీడ్ రోల్ లో మలుపు సినిమా తెరకెక్కించారు. అయితే ఈ ఇద్దరు తెలుగు సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుమారులు. ఇందులో ఒకరు హీరో అవ్వగా, మరొకరు డైరెక్టర్ అయ్యారు.

అయితే రవిరాజా పెద్ద కొడుకు సత్య ప్రభాస్ కు ఎప్పట్నుంచో డైరెక్టర్ అవ్వాలని కోరిక ఉండేదట. ఓ సారి ఈ విషయం ఆయనకు చెబితే.. ముందుగా చదువు పూర్తైయ్యాక రెండేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత చూద్దాం లే అని తండ్రి రవిరాజా చెప్పారట. కానీ, సత్య ఎంబీఏ కంప్లీట్ చేసి.. నేరుగా హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో ఆయనను స్టార్ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ గా చేయాలని సూచించారట. ఈ విషయాలన్ని తాజా ఇంటర్వ్యూలో రవిరాజా పంచుకున్నారు.

ఈ క్రమంలోనే ఆయనను రామ్ గోపాల్ వర్మ దగ్గరకు పంపించారని, అదే ఆయన చేసిన తప్పు అని ఇంటర్వ్యూలో చెప్పారు. నా పెద్ద కొడుకు సత్యను మొదట శంకర్ దగ్గరకు పంపించా. ఆయనేదో పాయింట్ ఇచ్చి కథ రాయమన్నారట. మావోడు బాగానే రాశాడట. నెక్స్ట్ తీసే దానికి పిలుస్తాను అని చెప్పాడు.

ఆ తర్వాత నేను చేసిన పొరపాటు ఏంటంటే.. మా వాడిని రామ్ గోపాల్ వర్మ దగ్గరకు పంపించడం. ఎవరి దగ్గరో పని చేయడం ఏంటి. సినిమాలు చూడు. మీ నాన్న డైరెక్టరే కదా. నీకు నచ్చింది నువ్వు చేయ్యి. అంతేకానీ, డైరెక్షన్ అనేది ఎవరి దగ్గరో నేర్చుకొని చేసేది కాదు. అని చెప్పి మావాడి బ్రేన్ వాష్ చేసి పంపించాడు. దీంతో మావాడు స్వయంగా సినిమా తీశాడు. ఇప్పుడు సిగ్నల్ అనే ఇంకో కథ రెడీ చేశాడు. త్వరలో పట్టాలెక్కుతుంది. అని దర్శకుడు రవిరాజా తన కొడుకును ఆర్జీవీ దగ్గరకు పంపిన విషయం గుర్తు చేసుకున్నారు.

ఇక ఆయన చిన్న కుమారుడు ఆది వైశాలీ, గుండెల్లో గోదారి, మరకతమణి లాంటి సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆది నిన్నుకోరి, రంగస్థలం లాంటి చిత్రలలో సహాయ నటుడిగా అదరిగొట్టాడు. ఇక అల్లు అర్జున్- బోయపాటి సరైనోడు లో ఏకంగా నెగెటివ్ షేడ్ లో ఇరగదీశాడు. ఈ సినిమాతో ఆదికి ఫ్యాన్స్ కూడా పెరిగారు. ప్రస్తతం ఆది అఖండ 2లో నెగిటివ్ పాత్రలో నటిస్తున్నాడు.