భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న నటుడి భార్య!
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట వైరల్ అవుతోంది.
By: Srikanth Kontham | 20 July 2026 6:00 PM ISTనితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `రామాయణం`పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రంగా మార్కెట్ లో నిలిచింది. ఇప్పటికే ప్రచార చిత్రాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ సమయం కూడా దగ్గర పడుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్న రవి దూబే లుక్ ,నటన చూసి ఆయన భార్య, నటి సర్గన్ మెహతాను తీవ్ర భావోద్వేగానికి గురిచేశాయి.
తెరపై రవిని లక్ష్మణుడి పాత్రలో చూసిన సర్గన్ తన ఆనందాన్ని, గర్వాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. భార్యగా, సహనటిగా ఆమె పంచుకున్న అనుభూతి సినిమాపై ఉన్న క్యూరియాసిటీని మరింత పెంచుతోంది.
రామాయణ కావ్యం గురించి చెప్పనక్కర్లేదు. అందులో లక్ష్మణుడి పాత్రకు ఉండే స్థానం, ఆ వ్యక్తిత్వంలోని గాఢత చాలా ప్రత్యేకం. అలాంటి పాత్రను రవి దూబే పోషిస్తున్నారనే? వార్త వచ్చినప్పటి నుంచి ఈ పాత్ర కోసం ఎంతలా శ్రమించారో ? తెలిసిందే. తాజాగా ఆ శ్రమకు తగ్గ ఫలితాన్ని తెరపై చూసిన సర్గన్ రవి రూపంలో లక్ష్మణుడిని చూసి ఆశ్చర్యపోయారు. భర్తను ఆ పాత్రలో చూడటం మధురమైన, భావోద్వేగపూరితమైన అనుభవంగా పేర్కొన్నారు. లక్ష్మణుడి పాత్రలో ఎమోషన్ సర్గన్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ పాత్రలో తాను సైతం లీనం కావడంతో? ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యారు.
సర్గన్ మెహతా స్పందనను బట్టి చూస్తుంటే? దర్శకుడు నితీష్ తివారీ ఈ పాత్రను ఎంతలా డిజైన్ చేశారో అర్థమవుతోంది. కేవలం బాహ్య రూపం మాత్రమే కాకుండా? లక్ష్మణుడికి ఉండే భక్తి, క్రమశిక్షణ, సోదర ప్రేమను రవి దూబే తన నటనతో అద్భుతంగా ఆవిష్కరించారని సర్గన్ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఒక నటిగా కూడా సర్గన్ రవి పని తీరును అభినందించడం విశేషం. ఇలాంటి ప్రతిభావంతులైన నటీనటులు సినిమాలో ఉండటం రామాయణం వంటి గొప్ప చిత్రానికి కలిసొచ్చే అంశం. రవి దూబేను లక్ష్మణుడిగా ఎంచుకోవడం వల్ల ఈ పాత్రకు మరింత ప్రాముఖ్యత .. కొత్తతరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశం దక్కింది.
`రామాయణం` కోసం టీమ్ పడుతున్న శ్రమ ప్రతి అడుగులోనూ కనిపిస్తోంది. రవి దూబే పాత్రపై సర్గన్ మెహతా చూపించిన స్పందన చిత్రం పట్ల ఉన్న పాజిటివ్ బజ్‌ను మరింత పెంచింది. లక్ష్మణుడి పాత్రలో రవి దూబేను చూడటానికి ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుంటే, యశ్ రావణుడి పాత్రలో తమదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు.
