Begin typing your search above and press return to search.

స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో న‌టుడు ఆర‌వ‌ అటెంప్ట్!

ర‌విబాబు స్వీయా ద‌ర్వ‌క‌త్వంలో `రేజర్` అనే సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. ఆయ‌నే హీరోగా న‌టిస్తోన్న చిత్ర‌మిది.

By:  Srikanth Kontham   |   11 Feb 2026 11:51 AM IST
స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో న‌టుడు ఆర‌వ‌ అటెంప్ట్!
X

ర‌విబాబు మ‌ల్టీట్యాలెంటెడ్. న‌టుడు కం రైట‌ర్, డైరెక్ట‌ర్ గా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇండ‌స్ట్రీలో రెండున్న‌ర ద‌శాబ్దాల ప్ర‌యాణం. న‌టుడిగా సీరియ‌స్ పాత్ర‌ల‌తో పాటు కామెడీ పాత్ర‌లు పోషించి త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నాడు. తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల్లోనూ న‌టించాడు. ఎంత గొప్ప న‌టుడో? అంత‌కు మించి మంచి ద‌ర్శ‌కుడు, రైట‌ర్ కూడా. `అల్ల‌రి`తో డైరెక్ట‌ర్ గా కెరీర్ ప్రారంభించాడు. అత‌డి ప్ర‌తిభ‌ను గుర్తించి ద‌ర్శ‌క దిగ్గ‌జం ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ త‌నయుడు న‌రేష్ ని ర‌విబాబు చేతుల్లోనే పెట్టారు.

తాను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసే అవ‌కాశం ఉన్నా? ఆ ఛాన్స్ తాను తీసుకోకుండా ర‌విబాబుకు అప్ప‌గించారు. అనుకున్న‌ట్లుగానే న‌రేష్ లో గొప్ప న‌టుడిని తొలి సినిమాతోనే వెలికి తీసాడు ర‌విబాబు. `అల్ల‌రి` సినిమా అంత పెద్ద హిట్ అయిందంటే? ర‌విబాబును మించిన కారుకుడు న‌రేష్ పెర్పార్మెన్స్ తోనే సాద్య‌మైంది. ఈ చిత్రాన్ని ర‌విబాబు స్వీయా నిర్మాణంలో తెర‌కెక్కించాడు. ఇలా ద‌ర్శ‌క‌, నిర్మాణంలో సినిమా మొద‌లు పెట్ట‌డం ర‌విబాబుకు ఇది నాల్గ‌వ సారి ఆర‌వ సారి విశేషం. తాజాగా ఆరేళ్ల‌కు మ‌ళ్లీ ఇదే త‌ర‌హా ప్ర‌యాణంలో క‌నిపిస్తున్నాడు.

ర‌విబాబు స్వీయ ద‌ర్వ‌క‌త్వంలో `రేజర్` అనే సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. ఆయ‌నే హీరోగా న‌టిస్తోన్న చిత్ర‌మిది. తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ చూడ‌ని వినూత్న క‌థ‌తో పూర్తి యాక్ష‌న్ సినిమాగా దీన్ని తీర్చిదిద్దుతున్నాడు. ఇందులో ర‌విబాబు పాత్ర ఎంతో వైలెంట్ గా ఉంటుందిట‌. అయితే ఇలా స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో సినిమా నిర్మించ‌డం ర‌వి బాబు కెరీర్ లో ఆర‌వ సారి. తొలి సినిమా `అల్ల‌రి` త‌ర్వాత చాలా కాలం సాటు స్వీయా నిర్మాణంలో సినిమాలు చేయ‌లేదు. కేవ‌లం ద‌ర్శ‌కుడిగా ఇత‌ర బ్యాన‌ర్ల‌ల‌లో సినిమాలు చేసాడు.

`అల్ల‌రి` త‌ర్వాత `అనసూయ` అనే చిత్రాన్ని స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించాడు. అనంత‌రం మ‌ళ్లీ ఎనిమిదేళ్ల త‌ర్వాత `అవును 2` అనే చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఆ సినిమా అంచ‌నాలు అందుకోలేదు. ఎంతో ఎఫెర్ట్ తో చేసిన చిత్ర‌మిది. దీంతో మ‌రో ప్ర‌య‌త్నానికి పెద్ద‌గా గ్యాప్ తీసుకోలేదు. మూడేళ్ల వ్య‌వ‌ధిలోనే `అదుగో` అనే చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఇదీ ప్లాప్ అయింది. దీంతో ఏడాది గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టూ బ్యాక్ `ఆవిరి`, `క్ర‌ష్` అనే మ‌రో రెండు చిత్రాల‌ను స్వీయా నిర్మాణంలో తెర‌కెక్కించాడు. కానీ ఈ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి.

`రేజ‌ర్` తో ఎలాగైనా హిట్ అందుకోవాల‌న్న‌ది ర‌విబాబు ప్లాన్. ప్ర‌స్తుతం అత‌డు న‌టుడిగా కూడా మునుప‌టిలా సినిమాలు చేయ‌లేదు. న‌టుల మ‌ధ్య పోటీ పెర‌గ‌డంతో అవ‌కాశాలు త‌గ్గాయి. కొత్త కొత్త నటులు తెరంగేట్రం చేస్తున్నారు. దీంతో సీనియ‌ర్ల‌కు అవ‌కాశాలు త‌గ్గుతున్నాయి. దీంతో ర‌విబాబు ద‌ర్శ‌కుడిగా బిజీ అవ్వాల‌ని చూస్తున్నాడు.