రవితేజ యాక్టింగ్ స్టైల్ కు ఆశ్చర్యపోయిన డైరెక్టర్
మాస్ మహారాజా రవితేజకు ఉన్న ఎనర్జీ, టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By: Sravani Lakshmi Srungarapu | 27 Aug 2026 9:00 PM ISTమాస్ మహారాజా రవితేజకు ఉన్న ఎనర్జీ, టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన యాక్టింగ్ వెనుక ఉన్న వర్కింగ్ స్టైల్ మాత్రం చాలామందికి తెలియని విషయం. తాజాగా దర్శకుడు శివ నిర్వాణ చెప్పిన మాటలు వింటే.. రవితేజ సెట్‌లో ఎంత భిన్నంగా పనిచేస్తారో అర్థమవుతుంది. ముఖ్యంగా ఒక సీన్‌ను చేయడానికి ఆయన అనుసరించే విధానం ఆసక్తికరంగా మారింది.
సాధారణంగా ఒక యాక్టర్ సీన్ చేస్తున్నప్పుడు అంతకుముందు జరిగిన సీన్, తర్వాత వచ్చే సీన్, క్యారెక్టర్ జర్నీ వంటి విషయాలను మైండ్‌లో ఉంచుకుని పెర్ఫార్మెన్స్ ఇస్తుంటారు. కానీ రవితేజ మాత్రం దీనికి భిన్నంగా ఉంటారని శివ నిర్వాణ వెల్లడించారు. ఒక సీన్ చేయాల్సినప్పుడు గతంలో ఏం చేశారో, తర్వాత ఏం చేయబోతున్నారో ఎక్కువగా వివరించకుండా.. ప్రస్తుతం చేయాల్సిన సీన్ ఏంటో మాత్రమే చెప్పాలని ఆయన కోరుకుంటారని తెలిపారు.
డైరెక్టర్ గా సీన్స్ మధ్య కనెక్షన్‌ను వివరించేందుకు తాను ప్రయత్నించినప్పుడు మొదట్లో కొంత ఇబ్బందిగా అనిపించిందని శివ నిర్వాణ చెప్పారు. అయితే రవితేజ ఆ సీన్ ను తనదైన శైలిలో చేసి చూపించిన తర్వాత ఆయన యాక్టింగ్‌పై పూర్తి క్లారిటీ వచ్చిందని తెలిపారు. ఒకసారి డైరెక్టర్ పై నమ్మకం ఏర్పడితే రవితేజ పూర్తిగా తనను తాను డైరెక్టర్ చేతుల్లో పెట్టేస్తారని కూడా ఆయన చెప్పడం విశేషం.
ఇక్కడే రవితేజ యాక్టింగ్ స్టైల్‌లోని అసలు స్పెషాలిటీ కనిపిస్తుంది. ప్రతి సీన్ గురించి ఆలోచిస్తూ స్ట్రెస్ తీసుకోవడం కంటే.. ఆ క్షణంలో క్యారెక్టర్ ఏం చేయాలో దానిపై మాత్రమే దృష్టి పెట్టడం ఆయన విధానంగా కనిపిస్తోంది. అందుకే డైరెక్టర్ చెప్పిన సీన్ ను ఎలాంటి ఎక్స్‌ట్రా థాట్స్ లేకుండా తన ఎనర్జీ, టైమింగ్‌తో తెరపైకి తీసుకొస్తారని చెప్పొచ్చు. అంతేకాదు, నీకేం కావాలో చెప్పు.. చేసి పెడతా అనే రవితేజ యాటిట్యూడ్ కూడా ఇదే విషయాన్ని ప్రతిబింబిస్తుంది. డైరెక్టర్ విజన్‌పై నమ్మకం పెట్టి, తన పని యాక్టింగ్ మాత్రమే అన్నట్టుగా వ్యవహరించడం ఆయనలోని అరుదైన లక్షణంగా శివ నిర్వాణ పేర్కొన్నారు.
