ఇరుముడి ఎఫెక్ట్.. ఆ విషయంలో రవితేజ అలర్ట్!
కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజా రవితేజకు రీసెంట్ గా వచ్చిన ఇరుముడి మూవీతో మంచి ఊపు వచ్చినట్టే కనిపిస్తోంది.
By: M Prashanth | 8 Oct 2026 11:00 PM ISTకొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజా రవితేజకు రీసెంట్ గా వచ్చిన ఇరుముడి మూవీతో మంచి ఊపు వచ్చినట్టే కనిపిస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఆ సినిమాలో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ పై స్ట్రాంగ్ ఎఫెక్ట్ చూపించాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. దీంతో తన నెక్స్ట్ మూవీ విషయంలో రవితేజ ఆ విషయంలో మరింత జాగ్రత్తగా తీసుకుంటున్నట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.
రవితేజ ప్రస్తుతం తులాభారం (రూమర్డ్ టైటిల్) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రానికి వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పిటకే వచ్చిన సినిమాల మ్యూజిక్ అవుట్ పుట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రవితేజ మూవీకి ఆయనే వర్క్ చేస్తారని వార్తలు వస్తుండడంతో అంచనాలు పెరిగాయి.
అయితే ఇరుముడి విషయంలో పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు పెద్ద ప్లస్ గా నిలిచింది. ముఖ్యంగా డివోషన్ బ్యాక్ వచ్చే పాటలు, ఎమోషనల్ సీన్స్ కు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. యాక్షన్ సన్నివేశాల్లో వచ్చే మ్యూజిక్ కూడా థియేటర్లలో మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. దీంతో సినిమా ఎక్స్పీరియన్స్ ను పెంచడంలో మ్యూజిక్ ఎంత అవసరమో మరోసారి క్లారిటీ వచ్చింది.
ఇదే ఇప్పుడు తులాభారం విషయంలో కూడా కనిపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ సినిమా హారర్ కామెడీతో పాటు యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇలాంటి కథలో సాంగ్స్ కంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. భయపెట్టే సన్నివేశాలు, కామెడీ ఎపిసోడ్లు, యాక్షన్ బ్లాక్స్ కు సరైన మ్యూజిక్ పడితేనే థియేటర్లలో కంప్లీట్ రేంజ్ లో ఇంపాక్ట్ వస్తుంది.
అందుకే వివేక్ సాగర్ సెలక్షన్ కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ పెంచుతోంది. తనదైన ప్రత్యేక శైలిలో లోకల్ నేటివిటీని, వెస్ట్రన్ టచ్ ను కలిపి మ్యూజిక్ అందించడంలో ఆయనకు మంచి పేరుంది. మరోవైపు రవితేజ వరుసగా మరో మంచి విజయాన్ని అందుకోవాలంటే కథ, టేకింగ్ తో పాటు ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేసే ఎలిమెంట్స్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పాలి. అందులో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ కూడా మెయిన్ పార్టే.
ఇక ఇరుముడి మూవీలో మ్యూజిక్ ఇచ్చిన ఇంపాక్ట్ ను చూసిన తర్వాత తులాభారం సినిమాలో కూడా ఆ విషయంలో ఎక్కడా ఎలాంటి లోటు ఉండకూడదని అలర్ట్ అయినట్లు కనిపిస్తోంది. మరి వివేక్ ఆత్రేయ- వివేక్ సాగర్ కాంబినేషన్ రవితేజకు ఎలాంటి మ్యూజికల్ ట్రీట్ ఇస్తుందో.. సినిమాపై వారి మంచి వర్కింగ్ రిలేషన్ ఎంతటి ఎఫెక్ట్ చూపిస్తుందో.. బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో హిట్ అవుతుందో అంతా వేచి చూడాలి.
