క్లాస్ ఎమోషన్స్ తర్వాత మాస్ రాజా పక్కా మాస్ రూట్!
మాస్ మహారాజా రవితేజ - కోలీవుడ్ కమర్షియల్ మాస్టర్ హరి కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
By: Srikanth Kontham | 15 Jun 2026 3:18 PM ISTమాస్ మహారాజా రవితేజ - కోలీవుడ్ కమర్షియల్ మాస్టర్ హరి కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా? ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్ -సోషల్ మీడియా బజ్ ఆధారంగానే కాంబోపై ట్రేడ్‌లో అంచనాలు రేకెత్తుతున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ గనుక నిజమైతే వెండితెరపై ఇద్దరు కలిసి ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తారు? అసలు వీరి కలయికలో ఎలాంటి .కథాంశంతో సినిమా వచ్చే అవకాశం ఉందనే దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది.
హరి మేకింగ్ శైలి గురించి సౌత్ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. `సామి`, `ఆరు`, `వేల్`, `సింగం` వంటి చిత్రాలతో మాస్ యాక్షన్ పల్స్‌ను పక్కాగా పట్టుకున్న దర్శకుడాయన. బుల్లెట్ వేగంతో పరిగెత్తే స్క్రీన్‌ప్లే, హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, పవర్‌ఫుల్ హీరో ఎలివేషన్స్ హరి సినిమాల్లో కామన్ ఎలిమెంట్స్. రవితేజకు ఉండే వింటేజ్ బాడీ లాంగ్వేజ్, లౌడ్ డైలాగ్ డెలివరీ, అన్‌మ్యాచ్‌డ్ స్క్రీన్ ఎనర్జీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైనవి. అలా ఇద్దరి బలాలు కలిస్తే తెరపై యాక్షన్ మాత్రమే కాదు. మాస్ మహారాజా మార్క్ వినోదం -ఎనర్జీ కూడా పీక్స్‌లో ఉంటాయని చెప్పొచ్చు.
ఈ కాంబినేషన్ గనుక లాక్ అయితే ఖచ్చితంగా అన్‌అపాలజిటిక్ అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ లేదా మైండ్ బ్లోయింగ్ కాప్ డ్రామా ఎంచుకునే అవకాశం ఉంది. రవితేజ కెరీర్‌లో `విక్రమార్కుడు` లాంటి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు ఆల్-టైమ్ క్లాసిక్స్‌గా నిలిచాయి. హరి మార్క్ `సింగం`తరహా అగ్రెసివ్ అండ్ సిన్సియర్ పోలీస్ క్యారెక్టరైజేషన్‌కు రవితేజ ఎనర్జీ తోడైతే? అది బాక్సాఫీస్ వద్ద పూనకాలు తెప్పించడం ఖాయం. కాప్ స్టోరీ కాకపోయినా? పల్లెటూరి లేదా మైగ్రేటెడ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే బలమైన ఫ్యామిలీ సెంటిమెంట్ .. లౌడ్ యాక్షన్ డ్రామాను ఈ కాంబోలో ఆశీంచొచ్చు.
ప్రస్తుత సమీకరణాల పరంగా చూస్తే రవితేజ కెరీర్ ప్లానింగ్‌లో ఈ సినిమా చాలా కీలకమైన మలుపు కానుంది. ప్రస్తుతం రవితేజ దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్న `ఇరుముడి` చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో విడుదల కాబోతున్న ఈ పీరియాడిక్ ఫ్యామిలీ డ్రామాలో రవితేజ క్లాస్- ఎమోషనల్ , అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. `ఇరుముడి` లాంటి హృదయాలకు హత్తుకునే క్లాస్ ఎమోషనల్ సినిమా తర్వాత.. రవితేజ మళ్లీ సొంత మాస్ రూట్‌లోకి రావడానికి దర్శకుడు హరి ప్రాజెక్ట్ పవర్‌ఫుల్ కౌంటర్ బ్యాలెన్స్‌లా పనిచేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ట్రేడ్ -ప్రొడక్షన్ పరంగా కూడా ఈ కాంబినేషన్‌కు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. దర్శకుడు హరి చాలా వేగంగా సినిమాలను పూర్తి చేయడంలో దిట్ట. భారీ బడ్జెట్లతో నెలల తరబడి షూటింగులు లాగకుండా అనుకున్న సమయానికి పక్కా ప్లానింగ్‌తో అవుట్‌పుట్ తేవడం ఆయన శైలి. రవితేజ కూడా వేగంగా సినిమాలు చేయడానికి ఇష్టపడే హీరో . కాబట్టి ఈ కాంబో పట్టాలెక్కితే కొన్ని నెలల వ్యవధిలోనే భారీ కమర్షియల్ బొమ్మ సిద్ధమైపోతుంది. పైగా హరి సినిమాలకు తెలుగు, తమిళ రెండు భాషల్లోనూ మంచి మార్కెట్ ఉండటం వల్ల పక్కా పాన్-సౌత్ ప్రాజెక్ట్‌గా బాక్సాఫీస్ వద్ద క్రేజ్ తెచ్చుకుంటుంది.
